జిన్‌పింగ్ పక్కనే ఉన్నా పట్టించుకోని ప్రధాని మోదీ

PM Modi, Chinese President Xi Jinping share stage at SCO summit. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశంలో

By Medi Samrat  Published on  16 Sept 2022 9:00 PM IST
జిన్‌పింగ్ పక్కనే ఉన్నా పట్టించుకోని ప్రధాని మోదీ

ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశంలో భారత్-చైనా దేశాల మధ్య బంధాలను మెరుగుపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినప్పటికీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కు ప్రధాని మోదీ కాస్త దూరంగానే ఉన్నారు. గాల్వాన్ వ్యాలీలో ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారి ప్రపంచ వేదికను పంచుకున్నారు. శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు పరస్పరం వ్యవహరించిన దూరం చూస్తే భారత్-చైనా మధ్య ఉద్రిక్తత స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రధాని మోదీ గురువారం సాయంత్రం డిన్నర్ మీటింగ్‌కు దూరమయ్యారని, వార్షిక శిఖరాగ్ర సమావేశానికి శుక్రవారం సమయానికి చేరుకున్నారని చెబుతున్నారు. ఫోటోల సమయంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పక్కపక్కనే నిలబడి ఉన్నారు, కానీ వారిద్దరూ కరచాలనం చేయలేదనే కథనాలు కూడా వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. ఇతర నాయకులు SCOకి హాజరయ్యారు. వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రాంతీయ భద్రతా పరిస్థితి, వాణిజ్యం, కనెక్టివిటీని పెంపొందించే మార్గాలపై చర్చించారు.


Next Story