ల్యాండింగ్ చేస్తూ ఢీ కొన్న రెండు విమానాలు.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

Planes trying to land collide in California.విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ చేసే స‌మ‌యంలో రెండు విమానాలు ఢీ కొన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Aug 2022 3:40 AM GMT
ల్యాండింగ్ చేస్తూ ఢీ కొన్న రెండు విమానాలు.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ చేసే స‌మ‌యంలో రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వాట్స‌న్‌విల్లేలోని విమానాశ్రయంలో అమెరికా కాల‌మానం ప్ర‌కారం గురువారం మ‌ధ్యాహ్నాం 2.56 గంట‌ల స‌మ‌యంలోరెండు చిన్న పాటి విమానాలు ల్యాండింగ్ అయ్యేందుకు య‌త్నించాయి. ఈ క్ర‌మంలో ఒక‌దానికొక‌టి ఢీ కొని కుప్ప‌కూలిపోయాయ‌ని అధికారులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందార‌ని, మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు.

'వాట్సన్‌విల్లే మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన రెండు విమానాలు ఢీకొన్న తర్వాత కూలిపోయాయి. ప‌లువురు మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం ఉంది. అని కాలిఫోర్నియా అధికారులు ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై విమానయాన అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు.

Next Story