నేపాల్‌లో ఘోర ప్ర‌మాదం.. ర‌న్‌వే పై కుప్ప‌కూలిన విమానం.. 72మంది ప్ర‌యాణీకులు

Plane with 72 people on board crashes in Nepal.నేపాల్ దేశంలో ఆదివారం ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jan 2023 12:38 PM IST
నేపాల్‌లో ఘోర ప్ర‌మాదం.. ర‌న్‌వే పై కుప్ప‌కూలిన విమానం.. 72మంది ప్ర‌యాణీకులు

నేపాల్ దేశంలో ఆదివారం ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్‌వే పై ఓ విమానం కుప్ప‌కూలింది. పొఖారా విమానాశ్ర‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

య‌తి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం దేశ రాజ‌ధాని ఖాట్మాండు నుంచి పొఖారాకు బ‌య‌లుదేరింది. పొఖారా విమానాశ్ర‌యంలో ల్యాండ్ అవుతుండ‌గా ఒక్కసారిగా కుప్ప‌కూలింది. క్ష‌ణాల్లో మంట‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డ్డాయి. ఆ స‌మ‌యంలో విమానంలో 68 మంది ప్ర‌యాణీకుల‌తో న‌లుగురు సిబ్బందితో క‌లిపి మొత్తం 72 మంది ఉన్నారు.

వెంట‌నే అధికారులు అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు. మంట‌ల‌ను అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. విమానం కూల‌డంతో పొఖారా విమానాశ్ర‌యాన్ని మూసివేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 30 మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీస‌ర్ తెక్ బ‌హ‌దూర్ కేసీ తెలిపారు. ఈ ప్ర‌మాదం నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు చాలా స్వ‌ల్పంగా ఉన్న‌ట్లు చెప్పారు. దీంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలను ఇంకా ప్రభుత్వం వెల్లడించలేదు.

Next Story