నేపాల్ నుంచి భారత్ కి పెట్రోల్ అక్రమ రవాణా.. చాలా చౌక బేరం..!

Petrol smuggling from Nepal to India. భారత్‌లో పెట్రో ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నేపాల్ నుంచి

By Medi Samrat  Published on  25 Feb 2021 11:50 AM GMT
నేపాల్ నుంచి భారత్ కి పెట్రోల్ అక్రమ రవాణా.. చాలా చౌక బేరం..!

భారత్‌లో పెట్రో ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నేపాల్ నుంచి చమురు అక్రమ రవాణా తారస్థాయికి చేరింది. ఉత్తర్ప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్‌ జిల్లాకు చెందిన ముఠాలు నేపాల్లో తక్కువ ధరకే లభిస్తున్న పెట్రోల్, డీజిల్ ను భారత్‌కు అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నాయి. నేపాల్ సరిహద్దుకు 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం నుంచి బిహార్లోని తూర్పు చంపారాన్ జిల్లాలో వ్యాపారులకు అమ్ముతున్నారు. ఈ స్మగ్లింగ్ వల్ల సరిహద్దు ఇరువైపులా ఉన్న చమురు వ్యాపారులు నష్టపోతున్నారు.

ఈ అక్రమణ రవాణా సరిహద్దులోని 24కుపైగా గ్రామాల్లో జరుగుతోందని సమాచారం. ఈ ప్రాంతాల్లో పెద్దగా తనిఖీలు లేకపోవడం వల్ల స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగుతోంది. అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉన్నామని, ప్రత్యేక కార్యదళం సహకారంతో వీటిని కట్టడి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

భారత్ తో పోలిస్తే నేపాల్‌లో ఇంధన ధరలు చౌక. ప్రస్తుతం నేపాల్ లో లీటర్ పెట్రోలు (భారతీయ కరెన్సీలో) రూ.69.50 రూపాయలు ఉండగా, లీటరు డీజిల్ రూ.58.88కు లభిస్తోంది. నేపాల్ కు అధిక శాతం ఇంధనం భారత్ నుంచే అందడం గమనార్హం. అయితే రిఫైనరీ ఫీజు వసూలు చేయకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ధరలు తక్కువగా ఉన్నాయి.



Next Story