చైనా పైశాచిక‌త్వం.. మెట‌ల్ బాక్సుల్లో గ‌ర్భిణులు, పిల్ల‌ల నిర్భందం..!

People in China Being Forced to Quarantine in Metal Boxes.క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌దేశాలు వ‌ణికిపోతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2022 12:09 PM IST
చైనా పైశాచిక‌త్వం.. మెట‌ల్ బాక్సుల్లో గ‌ర్భిణులు, పిల్ల‌ల నిర్భందం..!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌దేశాలు వ‌ణికిపోతున్నాయి. ప్ర‌పంచ దేశాలు ఇలా అల్లాడిపోవ‌డానికి కార‌ణం చైనా దేశ‌మే అనే అప‌ఖ్యాతిని డ్రాగ‌న్ కంట్రీ మూట‌గ‌ట్టుకుంది. ఇక క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి చేయ‌డం కోసం చైనా దేశంలో క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధిస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ కల్లా జీరో కేసులే లక్ష్యంగా ఒక్కొక్క ప్రాంతాన్ని నిర్భందించుకుంటూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంది చైనా. ఒక్క కేసు వ‌చ్చినా.. ఆ ప‌ట్ట‌ణం మొత్తం లాక్‌డౌన్ విధిస్తోంది.

ఇక క‌రోనా రోగుల్ని ఇనుప డ‌బ్బాల్లో నిర్భంధిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆ వీడియోల్లో కరోనా సోకిన వారిని తీసుకువెళ్లేందుకు బస్సుల వరుసలు, మరోవైపు ప్రజలను నిర్భందించే మెటల్‌ బాక్స్‌ల వరుసలు కనిపిస్తున్నాయి. మెట‌ల్ బాక్సుల్లో ప్రెగ్నెంట్ మ‌హిళ‌లు, చిన్నారులు, వృద్దుల‌ను బంధిస్తున్నారు. ఈ బాక్సుల్లో ఓ ఉడెన్ బెడ్‌తో పాటు టాయిలెట్ ఉంటుంది. దాదాపు రెండు వారాల పాటు వారు ఆ చిన్న పెట్టెల్లో ఉండేలా నిర్భంధిస్తోంది.

పైగా అనేక ప్రాంతాల్లో నివాసితులను అర్ధరాత్రి దాటిన తర్వాత తమ ఇళ్లను విడిచిపెట్టి, నిర్భంధ కేంద్రాలకు వెళ్లాలని పేర్కొంది. ట్రాక్ అండ్ ట్రేస్ యాప్‌ల‌ను విరివిరిగా వాడుతూ.. త‌క్ష‌ణ‌మే వారిని క్వారంటైన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు కోట్ల మందిని త‌మ ఇళ్లలోనే చైనా అధికారులు నిర్భంధించారు. క‌నీసం కూర‌గాయ‌లు కొనేందుకు బ‌య‌ట‌కి వెళ్లేందుకు అనుమ‌తించ‌డం లేదు.

Next Story