సుంకాలు వ్యతిరేకించే వారు ఫూల్స్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాలు విధించారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఆయన నిర్ణయంపై...

By -  అంజి
Published on : 10 Nov 2025 10:08 AM IST

tariffs , Trump, Americans,

సుంకాలు వ్యతిరేకించే వారు ఫూల్స్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాలు విధించారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఆయన నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతలోనే ఆయ‌న‌ తన టారిఫ్ విధానాన్ని మరోసారి సమర్థించాడు. సుంకాలను వ్యతిరేకించే వారిని ఫూల్స్ అని ట్రంప్ అన్నారు. సుంకాల కారణంగా యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, అత్యంత గౌరవనీయమైన దేశంగా మారిందని ఆయ‌న‌ పేర్కొన్నారు.

టారిఫ్‌ల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి ఒక్కరికీ కనీసం $2,000 డివిడెండ్ చెల్లిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయాలను ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో రాశారు. అధ్యక్షుడు ట్రంప్ తన పోస్ట్‌లో సుంకాలను వ్యతిరేకించే వారు మూర్ఖులు అని రాశారు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, అత్యంత గౌరవనీయమైన దేశంగా అవతరించింది, దాదాపుగా ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ ధరలు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆయన రాశారు.

అమెరికా సుంకాల ద్వారా ట్రిలియన్‌ల కోట్ల డాలర్లు సంపాదిస్తున్నదని, దీని కారణంగా అమెరికా తన భారీ రుణాన్ని, 37 ట్రిలియన్ డాలర్లను త్వరలో చెల్లించడం ప్రారంభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పుడు రికార్డు స్థాయిలో పెట్టుబడులు జరుగుతున్నాయని ట్రంప్ అన్నారు. ఎక్కడ చూసినా ప్లాంట్లు, ఫ్యాక్టరీలు తెరుచుకుంటున్నాయని ఆయన తన పోస్ట్‌లో రాశారు. ప్రతి ఒక్కరికీ కనీసం ఒక వ్యక్తికి $2,000 డివిడెండ్ ఇస్తామని ఆయ‌న‌ చెప్పారు (అధిక ఆదాయం ఉన్నవారు తప్ప!). అయితే, ఈ పోస్ట్‌లో ప్రతిపాదిత చెల్లింపు ఎలా చేయబడుతుందో అని మాత్రం వివరించలేదు.

Next Story