అతని సాహసం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.!

Paraplegic athlete in wheelchair climbs 820 feet up Hong Kong skyscraper. వీల్ చైర్స్ సహాయంతోనే 320 మీటర్ల పొడవైన నైనా టవర్స్‌ను అధిరోహించి అందరిచేత ప్రశంసలు పొందాడు , ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అయ్యాడు.

By Medi Samrat  Published on  21 Jan 2021 2:45 AM GMT
Hong Kong skyscraper

కొంతమంది పొట్టకూటి కోసం ఎంతో ప్రమాదకరమైన సాహసాలను చేస్తూ జీవనం సాగిస్తుంటారు. మరికొందరు వారి ఆనందం కోసం సాహసాలు చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఇతరుల కడుపు నింపడానికి ప్రమాదకరమైన సాహసాలను చేస్తుంటారు. ఈ మూడవ కోవకు చెందిన వాడే హాంకాంగ్‌కు చెందిన లై చి. 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కేవలం వీల్ చైర్ కి మాత్రమే పరిమితమైన లై చి, ప్రస్తుతం తన వీల్ చైర్ పవర్ ఏమిటో అందరికీ చూపిస్తున్నాడు.

లై చి ఒక దివ్యాంగుడు అనే ఆలోచన లేకుండా ఎంతో ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తున్నాడు. ఎంతో ధైర్యసాహసాలకు ప్రతీకగా చెప్పుకొనే 495 లైన్ రాక్ పర్వతాన్ని ఐదు సంవత్సరాల క్రితమే వీల్ చైర్ సహాయంతో అధిరోహించాడు. అంతేకాకుండా,రాక్‌ క్లైంబింగ్‌లో నాలుసార్లు ఏషియన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. తాజాగా మరో సాహసానికి తెరతీశాడు లై చి.

వీల్ చైర్స్ సహాయంతోనే 320 మీటర్ల పొడవైన నైనా టవర్స్‌ను అధిరోహించి అందరిచేత ప్రశంసలు పొందాడు. ఈ సందర్భంగా లై చి మాట్లాడుతూ ఇలాంటి పర్వతాలు అధిరోహించడం కన్నా అద్దాలమేడను ఎక్కడం ఎంతో కష్టంగా ఉంటుందని తెలియజేశాడు. స్పైనల్ కార్డ్ పేషెంట్ల కోసం నిధుల సేకరణలో భాగంగా ఇలాంటి సాహసాలను చేస్తున్నట్లు లై చి తెలియజేశారు. ఈ సాహసాలను చేస్తున్నప్పుడు తనకు ఏమాత్రం తను ఒక దివ్యాంగుడు అనే ఆలోచన రాలేదని ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్తున్నానని లై చి ఈ సందర్భంగా తెలియజేశారు.ఇతను చేస్తున్న ఆలోచన విధానం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఇతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇతని సాహసం మరెంతో మందికి స్ఫూర్తి నివ్వాలని మరికొందరు కొనియాడారు.


Next Story