పాక్ ప్ర‌ధాని తిప్ప‌లు.. ర‌ష్యా అధ్య‌క్షుడి న‌వ్వులు.. వీడియో వైర‌ల్‌

Pakistan PM's awkward moment at SCO summit watch.పాక్ ప్ర‌ధాని షరీఫ్ ఇయ‌ర్ ఫోన్స్ వంటి ప‌రిక‌రాన్ని చెవిలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Sept 2022 12:38 PM IST
పాక్ ప్ర‌ధాని తిప్ప‌లు.. ర‌ష్యా అధ్య‌క్షుడి న‌వ్వులు.. వీడియో వైర‌ల్‌

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో గురువారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. అయితే.. సమావేశాన్ని ప్రారంభించేట‌ప్పుడు పాక్ ప్ర‌ధాని షరీఫ్ ఇయ‌ర్ ఫోన్స్ వంటి ప‌రిక‌రాన్ని చెవిలో పెట్టుకునేందుకు ఇబ్బందులు ప‌డ్డారు. ఇది చూసి ప‌క్క‌నే ఉన్న ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ న‌వ్వుకున్నారు.

వీడియోలో ఏం ఉందంటే..?

చ‌ర్చ‌లు ప్రారంభించేందుకు పుతిన్ ఇయ‌ర్ ఫోన్స్ వంటి ప‌రిక‌రాన్ని చెవిలో పెట్టుకోగా.. షెహ‌బాజ్ మాత్రం ఇబ్బందులు ప‌డ్డాడు. అనంత‌రం త‌న‌కు ఎవ‌రైనా సాయం చేస్తారా..? అని అడుగ‌గా.. భ‌ద్ర‌తా సిబ్బందిలో ఒక‌రు ఒక‌రు వ‌చ్చి సాయం చేశారు. అత‌డు వెళ్లిన వెంట‌నే మ‌ళ్లీ ఆ ప‌రికరం ఊడి కింద‌ప‌డిపోయింది. దీంతో మ‌రోసారి అత‌డు వ‌చ్చి.. షెహ‌బాజ్ చెవిలో ఆ ప‌రిక‌రాన్ని అమ‌ర్చాడు. ఎదురుగా కూర్చున్న‌ ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఈ త‌తంగాన్ని చూస్తూ న‌వ్వుకున్నారు. ఈ వీడియోను పాక్‌కు చెందిన పీటీఐ పార్టీ నేత షిరీన్ మాజారీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ క్రైం మినిస్ట‌ర్‌.. వ‌రుస‌గా పాక్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాడ‌ని " రాసుకొచ్చాడు. కాగా.. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇదిలా ఉంటే స‌మావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు ఇప్ప‌టికే ఉన్నందు వ‌ల్ల రష్యా నుంచి గ్యాస్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని తెలిపారు. రష్యా, కజకిస్ఠాన్, ఉజ్బెకిస్థాన్‌లలో మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇక ఆఫ్ఘనిస్థాన్ సమస్యను పరిష్కరించుకోవలసి ఉందని చెప్పారు. సెప్టెంబ‌ర్ 15న ప్రారంభ‌మైన షాంఘై సహకార సంఘం సమావేశాలు శుక్రవారం ముగియ‌నున్నాయి.

Next Story