భారతదేశానికి చెందిన సూపర్‌సోనిక్ క్షిపణి పాకిస్థాన్ మీదకు వచ్చిందని పాక్ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం సిర్సా నుంచి టేకాఫ్ అయ్యిందని, పాక్ భూభాగంలోని 124 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశంలో బుధవారం సాయంత్రం అది ల్యాండ్ అయిందని చెప్పారు. 40,000 అడుగుల ఎత్తులో దూసుకువచ్చిందని.. ఇలాంటి మిసైల్స్ ద్వారా భారత, పాకిస్థాన్ దేశాల గగనతలంలో ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. పాకిస్థాన్ వైమానిక దళం ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్ చూస్తూ ఉండగా.. దాని ప్రారంభ మార్గం నుండి ఆ వస్తువు అకస్మాత్తుగా పాకిస్థాన్ భూభాగం వైపుకు దూసుకెళ్లిందని ఆ దేశ మిలిటరీ తెలిపింది. పాక్ గగనతలం లోకి వచ్చి, చివరికి మియా చన్ను సమీపంలో పడిపోయిందని అంటున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒక గోడ పడిపోయిందని పాకిస్థాన్ మిలిటరీ తెలిపింది. పాకిస్థాన్ వాదనపై భారత వైమానిక దళం లేదా రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఎటువంటి స్పందన లేదు.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య 2005 నాటి ఒప్పందం ప్రకారం.. ప్రతి దేశం ఇలాంటి పరీక్షల సమయంలో కనీసం మూడు రోజుల ముందుగా ఇతర దేశాలకు తెలియజేయాలని ఉంది. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలకు అనుగుణంగా అవసరమైన వ్యూహాత్మక చర్యలను ప్రారంభిస్తామని, దీనికి కారణమేదైనా, భారత్ నుండి మాకు వివరణ కావాలని పాక్ అంటోంది. పాకిస్థాన్‌లో ఆ మిసైల్ ప్రయాణించిన మొత్తం దూరం 124 కి.మీ అని, మొత్తం విమాన 6 నిమిషాల 46 సెకన్ల పాటూ ఎగిరింది, అది 3 నిమిషాల 44 సెకన్ల పాటు పాకిస్థాన్ భూభాగంలో ఉందని ఆ దేశ అధికారులు ఆరోపించారు.