ఇమ్రాన్ ఖాన్ గట్టెక్కాడు..!
Pak PM Imran Khan Wins Trust Vote Amid Opposition's Boycott Call. పాకిస్థాన్ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు గట్టెక్కాడు.
By Medi Samrat Published on 6 March 2021 2:30 PM GMTపాకిస్థాన్ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు గట్టెక్కాడు. పాక్ పార్లమెంటు దిగువ సభలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 178 ఓట్లు లభించాయి. బలపరీక్ష నెగ్గేందుకు 172 ఓట్లు అవసరం కాగా, ఇమ్రాన్ కు 6 ఓట్లు అధికంగానే లభించాయి. పీటీఐ పార్టీకి చెందిన 155 మంది ఎంపీలు తమ అధినేత ఇమ్రాన్ కే ఓటేశారు. బలూచిస్తాన్ అవామీ పార్టీ, ఎంక్యూఎం (పీ), గ్రాండ్ డెమొక్రటిక్ అలయెన్స్, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (క్వయిద్)కు చెందిన ఎంపీలు కూడా విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ కు మద్దతుగా నిలిచారు. ఓ స్వతంత్ర ఎంపీ కూడా ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు తెలపడంతో విశ్వాస పరీక్ష నెగారు.
తనకు ఓట్ చేసిన వారందరికీ ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపారు. విశ్వాస పరీక్ష సందర్భంగా పీటీఐ నాయకులు ఏమైనా షాక్ ఇస్తారా..? అని అందరూ ఆసక్తిగా గమనించినప్పటికీ అలాంటివేవీ జరగలేదు. రాజకీయ అనిశ్చితికి కేరాఫ్ అయిన పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ ఖాన్ భవిష్యత్తుపై గత కొద్దిరోజులుగా ఊహాగానాలు నడిచినప్పటికీ.. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి షాక్ ఇవ్వలేదు. బుధవారం జరిగిన సెనేట్ ఎన్నికల్లో ఇమ్రాన్ కేబినెట్ కు చెందిన ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమిపాలయ్యారు.
సెనేట్ ఎన్నికల్లో హఫీజ్ షేక్ పై మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ విజయం సాధించారు. దాంతో విపక్షాలు ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ తప్పుకోవాలంటూ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో బలపరీక్ష నిర్వహించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 178 ఓట్లు లభించాయి. బలపరీక్ష నెగ్గేందుకు 172 ఓట్లు అవసరం కాగా, ఇమ్రాన్ కు 6 ఓట్లు అధికంగానే లభించాయి. పీటీఐ పార్టీకి చెందిన 155 మంది ఎంపీలు తమ అధినేత ఇమ్రాన్ కే ఓటేశారు.