14 ఏళ్ల మైనర్ బాలికను ఎంపీ పెళ్లిచేసుకున్నాడు అనే వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. చట్టాలు సామాన్యులకే తప్ప తమకు పట్టవు అన్నట్లు రాజకీయ నాయకులు వ్యవహారిస్తారని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పాకిస్థాన్ దేశంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బలోచిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడైన జమియత్ ఉలేమా ఎ ఇస్తాం నాయకుడు మౌలానా సలాహుద్దీన్ అయూబీ పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. ఆ బాలిక 2006 అక్టోబరులో 28వ తేదీని జన్మించిందని.. జుగూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అని.. స్థానిక మహిళా స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
బాలిక తల్లిదండ్రులను విచారించగా.. తాము బాలికకు పెళ్లి చేయలేదని చెప్పారు. అయితే.. నిజంగానే ఆ పాక్ ఎంపీ బాలికను పెళ్లిచేసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. తమ కూతురికి 16 సంవత్సరాలు వచ్చే వరకు అత్తవారింటికి పంపమని బాలీక తండ్రి హామి ఇచ్చాడని అధికారులు అంటున్నారు. పాకిస్థాన్‌లో బాలికకు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెళ్లి చేయకూడదు. అలా చేస్తే.. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కఠిన శిక్ష పడుతుంది. ఎంపీనే చట్టాలను ఉల్లఘించాడనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.