గోల్డ్ మైన్ వద్ద మారణహోమం..దక్షిణ సూడాన్‌లో 70 మందికి పైగా పౌరులు కాల్చివేత

దక్షిణ సూడాన్ రాజధాని జుబాకు సమీపంలోని జెబెల్ ఇరాక్ బంగారు గని వద్ద గుర్తుతెలియని సాయుధ దుండగులు జరిపిన మారణహోమంలో 70 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు

By -  Knakam Karthik
Published on : 30 March 2026 6:13 PM IST

International News, South Sudan, Massacre, GoldMineAttack, GlobalViolence

గోల్డ్ మైన్ వద్ద మారణహోమం..దక్షిణ సూడాన్‌లో 70 మందికి పైగా పౌరులు కాల్చివేత

దక్షిణ సూడాన్ రాజధాని జుబాకు సమీపంలోని జెబెల్ ఇరాక్ బంగారు గని వద్ద గుర్తుతెలియని సాయుధ దుండగులు జరిపిన మారణహోమంలో 70 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గని వద్ద తలెత్తిన వివాదమే ఈ ఘోరానికి కారణం కాగా, మృతుల సంఖ్య 85 వరకు ఉండవచ్చని అనధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అనేకమంది తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.

2018 శాంతి ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, అక్రమ గనుల తవ్వకాలు మరియు సాయుధ గ్రూపుల ఆధిపత్య పోరు కారణంగా ఆ ప్రాంతంలో హింస రాజ్యమేలుతోంది. ఈ దారుణ ఘటనపై దక్షిణ సూడాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయనప్పటికీ, మైనింగ్ మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అంతర్జాతీయ సమాజం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.

Next Story