కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 10లక్షల పాజిటివ్ కేసులు
Over 1 Million COVID-19 Cases Reported In US.కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2022 2:57 PM ISTకరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వకిణిపోతుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది రోజులుగా అక్కడ రోజువారి కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. నిన్న(సోమవారం) ఒక్క రోజే 10 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలై రెండేళ్లు కావొస్తున్నప్పటికి.. ఒక్క రోజులో ఏ దేశంలోనూ కూడా రోజువారి కేసుల సంఖ్య ఈ స్థాయిలో నమోదు కాలేదు.
క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు అమెరికా కొంప ముంచాయని అమెరికా వార్తా సంస్థ యూఎస్ఏ టుడే వెల్లడించింది. రోజువారి కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని చెప్పుకొచ్చింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి 7.30 గంటల వరకు అమెరికా వ్యాప్తంగా 10,42,000 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి ఉద్దృతి నేపథ్యంలో స్కూళ్లు, కార్యాలయాలను మూసివేశారు. విమానాలను రద్దు చేశారు. ఆస్పత్రులన్ని కరోనా రోగులతో కిక్కిరిసి పోతున్నాయి.
కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అమెరికాలో మొత్తం 5.5కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. అంటే ఆ దేశ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికాలో 8.26లక్షల మంది కరోనా కాటుకు బలిఅయ్యారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ముమర్మం చేసింది. ఇప్పటి వరకు 62 శాతం మంది అమెరికన్లకు రెండు డోసుల టీకాలను ఇచ్చింది. కరోనా ఉద్దృతి నేపథ్యంలో బూస్టర్ డోసులను కూడా పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది.