పాకిస్థాన్ గుట్టు రట్టు చేసిన ఆ దేశ మాజీ.. ఏకంగా లాడెన్ నుండి డబ్బులు లాగాడట
Osama bin Laden supported, funded Nawaz Sharif. పాకిస్థాన్.. ఉగ్రవాదులు ఎంతో స్వేచ్ఛగా బ్రతికేయొచ్చు. ఏ మాత్రం టెన్షన్
By Medi Samrat Published on 2 Feb 2021 6:06 PM ISTతాజాగా పాకిస్థాన్ కు సంబంధించి ఓ షాకింగ్ నిజం బయటకొచ్చింది. ఒసామా బిన్ లాడెన్‌ను, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మధ్య సంబంధాలుండేవట. షరీఫ్‌కు లాడెన్ ఆర్థికంగా ఒసామా మద్దతునిచ్చేవాని పాక్ మాజీ ఉన్నతాధికారి ఒకరు స్వయంగా వెల్లడించారు. బిన్ లాడెన్-నవాజ్ షరీఫ్‌ల మధ్య ఓ విషయంలో ఒప్పందం ఉండేదని.. లాడెన్ తరచూ షరీఫ్‌కు ఆర్థిక సాయం చేసేవారని గతంలో అమెరికాలో పనిచేసిన పాకిస్థాన్ రాయబారి అబిదా హుస్సేన్ చెప్పుకొచ్చారు. ఓ ప్రముఖ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు. షరీఫ్ హయాంలో అబిదా హుస్సేన్ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆమె చెబుతోంది నిజాలేనని అందరూ అనుకుంటూ ఉన్నారు.
ఇక అవినీతి ఆరోపణల కేసులో 2017లో పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అనారోగ్య కారణాలతో గత కొన్ని నెలలగా అక్కడే జీవిస్తున్నారు.