ప్రపంచ అణు వినాశ‌నానికి చాలా దగ్గరగా ఉన్నాం.. యూఎన్‌ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Nuclear annihilation just one miscalculation away UN Chief Antonio guterres warns. ప్రపంచ దేశాలకు యునైటెడ్ నేషన్స్‌ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ హెచ్చరిక జారీ చేశారు. ప్రపచం అణు

By అంజి  Published on  2 Aug 2022 7:28 AM GMT
ప్రపంచ అణు వినాశ‌నానికి చాలా దగ్గరగా ఉన్నాం.. యూఎన్‌ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ దేశాలకు యునైటెడ్ నేషన్స్‌ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ హెచ్చరిక జారీ చేశారు. ప్రపచం అణు వినాశనానికి అడుగు దూరంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఒక చిన్న తప్పుడు పని చేసినా, చిన్న పొరపాటు జరిగినా.. అణు విధ్వంసం జరుగుతుందన్నారు. ఈ విధ్వంసం వల్ల మానవాళి ప్రమాదంలో పడుతుందని గుటెర్రెస్ వ్యాఖ్యానించారు. న్యూక్లియర్‌ వెపన్స్‌ వ్యాప్తిని నియంత్రించడానికి, అణ్వాయుధ రహిత ప్రపంచాన్ని సాధించడం లక్ష్యంగా 50 ఏళ్ల నాటి మైలురాయి ఒప్పందాన్ని సమీక్షించడానికి ఎన్పీటీ సంస్థ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో గుటెర్రస్ మాట్లాడారు.

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంతో పాటు ఆసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో ఉన్న అణు ఆయుధ ఆందోళన నేపథ్యంలో ఈ కామెంట్స్‌ చేసినట్లు తెలుస్తోంది. అమెరికా, జ‌పాన్‌, జ‌ర్మ‌నీ వంటి దేశాల‌తో అణు ఆయుధ స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అయ్యే ఛాన్స్‌ ఉన్న‌ట్లు స‌మావేశంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయ‌ం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్ర‌క‌టించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ అంశాన్ని త‌న ప్ర‌సంగంలో గుటెర్ర‌స్‌ ప్రస్తావించారు. ప్ర‌స్తుతం ర‌ష్యా అత్యంత శ‌క్తివంత‌మైన అణ్వాయుధ దేశ‌మ‌ని చెప్పారు. ప్రపంచ‌వ్యాప్తంగా దాదాపు 13వేల అణు ఆయుధాలు ఉన్నాయ‌ని, ఆత్మ‌ర‌క్ష‌ణ పేరుతో చాలా వ‌ర‌కు దేశాలు అణు బాంబుల కోసం బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు.. అణు ఆయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంపై చర్చించారు. ఉత్తర కొరియా తన ఏడవ అణు పరీక్షను నిర్వహించడానికి సిద్ధమవుతోందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. మరోవైపు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్.. రష్యా 1994లో ఉక్రెయిన్‌కు ఇచ్చిన హామీలను క్రూరంగా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. కాగా సమావేశాలు ముగిసే నాటికి తదుపరి చర్యలపై ఏకాభిప్రాయానికి రావాలని, మానవాళికి సరికొత్త పథాన్ని చూపాలని గుటెర్రస్ అన్నారు.

Next Story