అక్కడ రెండో పెళ్లి చేసుకోకపోవడం నేరం.. స్త్రీలు కూడా.!

Not having a second marriage is a crime in Eritrea on the African continent. రెండో పెళ్లి చేసుకోవడానికి ఆప్షన్‌ ఉంటే కొంత మంది భర్తలు అస్సలు ఆగరు. ఇక మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకునేందుకు

By అంజి  Published on  24 Aug 2022 3:51 PM IST
అక్కడ రెండో పెళ్లి చేసుకోకపోవడం నేరం.. స్త్రీలు కూడా.!

రెండో పెళ్లి చేసుకోవడానికి ఆప్షన్‌ ఉంటే కొంత మంది భర్తలు అస్సలు ఆగరు. ఇక మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడతారు భర్తలు. అయితే చాలా దేశాల్లో రెండో పెళ్లి అనేది చట్టరీత్యా నేరం. కానీ ఆ దేశంలో మాత్రం కాదు. ఎందుకంటే ఆ దేశ ప్రజలు కచ్చితంగా రెండు పెళ్లిలు చేసుకోవాల్సిందే. ఒక వేళ రెండు పెళ్లిలు చేసుకోకపోతే జైలుకు వెళ్లాల్సింది. రెండు పెళ్లిలు చేసుకోకపోతే నేరం చేసినట్టే.. ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆ దేశం ఎక్కడుంది, రెండు పెళ్లిలు ఎందుకు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలో వెరైటీ వివాహ సంప్రదాయం ఉంది. ఆ దేశంలో రెండు పెళ్లిలు చేసుకోవడం నేరం కాదు. పైగా రెండో పెళ్లి చేసుకోక పోవ‌డ‌మే నేరం. ఇది ఆ దేశ సంప్రదాయంతో పాటు చట్టం కూడా. ఎరిత్రియాలో పుట్టిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా రెండు వివాహాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ రెండు పెళ్లి చేసుకోకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం.. నేరం చేసిన వారికి జీవిత ఖైదు శిక్ష విధిస్తారు. ఈ చట్టం పురుషులతో పాటు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అంటే ప్రతి స్త్రీ తన భర్త రెండో పెళ్లి అంగీకరించాలన్న మాట.

ప్రతి భార్య తన భర్తను ఇంకో మహిళతో పంచుకోవాలి. ఇందుకు భార్య అంగీకారం తెలపకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అయితే ఎరిత్రియా దేశంలో రెండు పెళ్లిళ్ల నిబంధన వెనుక బలమైన కారణం దాగుంది. ఆ దేశంలో పురుషుల కంటే స్త్రీ జనాభా చాలా ఎక్కువ. దీని కారణంగా చాలా మంది స్త్రీలు పెళ్లి కాకుండా మిగిలిపోయే ప్రమాదం ఉంది. స్త్రీ, పురుష నిష్పత్తిలో చాలా తేడా వస్తుండటంతో.. దానిని సమం చేసేందుకు ఈ రెండు పెళ్లిళ్ల నిబంధన తీసుకొచ్చారు. ఈ చట్టంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.

Next Story