ఆప్ఘాన్‌లో కూలింది.. భారత విమానం కాదు: ప్రభుత్వం

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బదక్షన్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల విమానం కూలిపోయిందని స్థానిక మీడియా తెలిపింది.

By అంజి  Published on  21 Jan 2024 7:56 AM GMT
Passenger plane crash, Afghanistan, Badakhshan province

ఆప్ఘాన్‌లో కూలింది.. భారత విమానం కాదు: ప్రభుత్వం 

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బదక్షన్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల విమానం కూలిపోయిందని స్థానిక మీడియా తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ మీడియా ప్రకారం.. మాస్కోకు వెళ్తున్న విమానం ఆఫ్ఘనిస్తాన్‌లోని బదాక్షన్‌లోని వాఖాన్ ప్రాంతంలో కూలిపోయింది. బదక్షన్‌లోని తాలిబాన్ సమాచార , సంస్కృతి మంత్రి ఈ సంఘటనను ధృవీకరించారు. ప్రావిన్స్‌లోని కరణ్, మంజన్, జిబాక్ జిల్లాల్లో విస్తరించి ఉన్న తోప్‌ఖానే పర్వతంలో ప్రయాణీకుల విమానం కూలిపోయిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధికారిక వర్గాలు ప్రాణనష్టం లేదా ప్రమాదానికి గల కారణాలపై సమాచారాన్ని అందించలేదు.

ప్రమాదానికి ముందు రోజు రాత్రి రాడార్ నుండి తప్పుకున్న విమానం తోప్‌ఖానా ప్రాంతంలోని ఎత్తైన పర్వతాలలో కూలిపోయిందని బదక్షన్‌లోని తాలిబాన్ పోలీసు కమాండ్ పేర్కొంది. అయితే ఈ విమానం భారత్‌కు చెందినదని మొదట వార్త కథనాలు ప్రసారమయ్యాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం స్పందించింది. కూలిన విమానం భారత్‌కు చెందినది కాదని తెలిపింది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నోట్‌ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన దురదృష్టకర విమాన ప్రమాదం భారతీయ షెడ్యూల్డ్ విమానం లేదా నాన్ షెడ్యూల్డ్ (NSOP)/చార్టర్ విమానం కాదు. ఇది మొరాకో దేశానికి చెందిన చిన్న విమానం.

Next Story