ఇంట్లో బొద్దింకలను పెంచితే లక్షల్లో డబ్బు

North Carolina company offers to pay homeowners to release 100 cockroaches into their homes.ఎవరైనా మీకు రూ.1.5 లక్షలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2022 2:32 PM IST
ఇంట్లో బొద్దింకలను పెంచితే లక్షల్లో డబ్బు

ఎవరైనా మీకు రూ.1.5 లక్షలు ఇస్తే, మీరు బొద్దింకలతో కలిసి ఉండడానికి అంగీకరిస్తారా? ఇది వింతగా కనిపించినప్పటికీ, ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక పెస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఈ ఆఫర్ ను ఇచ్చింది. సదరు సంస్థ ఇళ్లలో బొద్దింకలను ఎలా కట్టడి చేయవచ్చో పరిశోధించాలనుకుంటోంది. పెస్ట్ ఇన్ఫార్మర్ తన వెబ్‌సైట్‌లో ఆఫర్ వివరాలను పోస్ట్ చేసింది. నిర్దిష్ట పెస్ట్ మేనేజ్‌మెంట్ విధానాన్ని పరీక్షించడానికి ఎవరైనా ఒప్పుకుంటే కస్టమర్ల ఇళ్లలోకి బొద్దింకలను విడుదల చేయనున్నారు.

నార్త్ కరోలినాలో ఉన్న పెస్ట్ ఇన్ఫార్మర్, యునైటెడ్ స్టేట్స్‌లోని ఇంటి యజమానులకు 100 బొద్దింకలను వారి ఇళ్లలోకి వదలడానికి బదులుగా $2,000 అందిస్తోంది. 100 బొద్దింకలను వారి ఇళ్లలోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న 5-6 మంది ఇళ్ల యజమానుల కోసం వెతుకుతున్నట్లు కంపెనీ పేర్కొంది. వీరు ఇలా వదిలాక.. ఆ బొద్దింకల ముట్టడిని వదిలించుకోవడానికి కొత్త మార్గాలను ప్రయత్నిస్తారు. ఈ ట్రయల్ దాదాపు ఒక నెల పాటు కొనసాగుతుంది. సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి కీటకాలను తొలగించడానికి కంపెనీ పెస్ట్ కంట్రోల్ నిపుణులను పంపుతుంది.

ఆ డబ్బులు సంపాదించుకునేవారు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని పరిమితులు ఉన్నాయి. వెబ్‌సైట్ ప్రకారం.. ఇంటి యజమాని నుండి వ్రాతపూర్వక ఒప్పందం తప్పనిసరిగా ఉండాలి. అలాగే కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. ఇల్లు యునైటెడ్ స్టేట్స్ లో ఉండాలి. 30-రోజుల వ్యవధిలో ఇంటి యజమానులు ఏ ఇతర పెస్ట్ కంట్రోల్ పద్ధతులను ఉపయోగించడానికి అనుమతించబడరని కూడా నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికన్ బొద్దింకలను నిర్మూలించడం చాలా కష్టం. కంపెనీ ఆ ఇళ్లలో కనీసం 100 బొద్దింకలను విడుదల చేస్తుంది. ఆ బొద్దింకల కదలికలను కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంది. నెల రోజుల తర్వాత ఇంట్లో బొద్దింకలు లేకుండా నిర్ములిస్తారు.

Next Story