జైల్‌లోని చీకటి, పురుగులు ఉన్న గదిలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
అటక్ జైల్లో శిక్ష అనుభివిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 3:24 PM ISTజైల్‌లోని చీకటి, పురుగులు ఉన్న గదిలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు అధికారులు. తోషాఖానా కేసులో అరెస్ట్ చేసి అటక్ జైలుకి తరలించిన విషయం తెలిసిందే. అయితే.. ఇమ్రాన్‌ఖాన్‌కు జైల్‌లో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని తెలుస్తోంది. చిన్న చీకటి గదిలో ఇమ్రాన్‌ను ఉంచారని సమాచారం. అందులోనే బాత్రూం.. చీమలు, పురుగులు తిరుగుతున్నాయని ఇమ్రాన్‌ఖాన్ లాయర్ తెలిపారు. అంతేకాక ఎవరినీ కలిసేందుకు అనుమతి కూడా ఇవ్వడం లేదని చెప్పారు. లోపల కనీస సదుపాయాలు కల్పించకపోయినా.. బయట మాత్రం భారీ భద్రత ఏర్పాటు చేశారని అంటున్నారు ఇమ్రాన్‌ఖాన్ వర్గీయులుజ
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న అటక్ జైల్లో శిక్ష అనుభవిస్తోన్న ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన తరఫు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ కలిశారు. శిక్ష విధించడంలో కోర్టుతీర్పును సవాల్ చేసేందుకు అవసరమైన పత్రాలపై ఇమ్రాన్ సంతకం తీసుకునేందుకు న్యాయవాది పంతోజి జైల్‌కు వెళ్లారు. ఇమ్రాన్‌ఖాన్‌కు కల్పించిన సదుపాయాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటన్నరపాటు ఇమ్రాన్‌తో ఆయన న్యాయవాది హైదర్ పంతోజి మాట్లాడారు.
జైల్‌లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో మాట్లాడిన లాయర్ ఈ వివరాలు చెప్పారు. 'ఇమ్రాన్‌ఖాన్‌ను ఓ చిన్న గదిలో ఉంచారు. అందులో చీకటిగా ఉంది. టీవీ, వార్తా పత్రిక కూడా అందుబాటులో లేదు. ఇక ఆ చిన్న రూమ్‌లోనే బాత్రూమ్ ఉంది. ఈగలు, చీమలు తెగ తిరుగుతున్నాయి. తనని ఒక ఉగ్రవాదిగా చూస్తున్నారని ఇమ్రాన్‌ఖాన్ వాపోయారు. ఎవరినీ కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదని ఇమ్రాన్ చెప్పారు. తన జీవితం మొత్తం జైల్‌లోనే గడిపేందుకు సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు' అని న్యాయవాది వెల్లడించారు.
ఇమ్రాన్‌ఖాన్‌క ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ సభ్యులు కోరుతున్నారు. ఆయన ఇంతకు ముందు దేశ ప్రధానిగా పని చేశారని.. అలాగే పాక్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయాలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఇమ్రాన్‌ను అటక్ జైల్ నుంచి అదియాలా జైల్‌కు మార్చాలని.. అలాగే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరింది పీటీఐ పార్టీ. ఆయన ఉన్నత చదువు, సామాజిక, రాజకీయ హోదాతో మెరుగైన జీవన విధానాన్ని గడిపారని.. ప్రత్యేక సదుపాయాలు అందుకోవడంలో ఇమ్రాన్‌ఖాన్ అర్హుడని పీటీఐ తన పిటిషన్‌లో పేర్కొంది.