సొంత రాష్ట్రంలోనే ఓటమిపాలైన నిక్కీ

సొంత రాష్ట్రం సౌత్‌ కరోలినాలో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు.

By అంజి  Published on  26 Feb 2024 8:00 AM GMT
Nikki Haley, Trump,US voters, Joe Biden, general election

సొంత రాష్ట్రంలోనే ఓటమిపాలైన నిక్కీ 

సొంత రాష్ట్రం సౌత్‌ కరోలినాలో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు. ఆమెకు 39.4 శాతం ఓట్లు పడగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు 59.9 శాతం ఓట్లతో విజయం సాధించారు. అయితే సూపర్‌ ట్యూస్‌ డేలో గట్టి పోటీ ఇస్తానని నిక్కీ అంటున్నారు. ఏది ఏమైనా రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ స్పీడ్ గా దూసుకుపోతున్నాడు.

హేలీ గత నెలలో మాజీ అధ్యక్షుడిపై తన దాడులకు పదును పెట్టారు. ఆమె ట్రంప్ మానసిక దృఢత్వాన్ని, వ్లాదమిర్ పుతిన్‌తో అతని అనుబంధాన్ని ప్రశ్నించింది. NATOపై అతని వ్యాఖ్యలను, ఉక్రెయిన్‌పై ట్రంప్ వైఖరిని ఖండించింది. ట్రంప్ వ్యక్తిగత PR మెషీన్‌గా పనిచేసే సాంప్రదాయిక మీడియాపై ఆమె చాలా విమర్శలు చేసింది. అయోవా, న్యూ హ్యాంప్‌షైర్, నెవడా రిపబ్లికన్‌ ప్రైమరీల్లో ట్రంప్‌ ఇప్పటికే విజయం సాధించారు. తాను ఓటమి పాలైనప్పటికీ సౌత్ కరోలినాలోని ఓటర్లకు హేలీ కృతజ్ఞతలు తెలిపారు.

రాబోయే సూపర్ ట్యూస్‌డే కోసం మిచిగాన్‌లో ప్రచారం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే.. హేలీ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయిన మొదటి మహిళ, మొదటి భారతీయ-అమెరికన్ అధ్యక్షురాలు అవుతుంది. పంజాబ్‌లోని అమృత్‌సర్ నుండి వలస వచ్చిన సిక్కు తల్లిదండ్రులకు నిక్కీ హేలీ జన్మించారు. అమెరికన్ ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉండాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నారు.

Next Story