గ్రాండ్ గా పార్టీ చేసుకున్న న్యూజిలాండ్.. ఎందుకంటే..!

New Zealand's Covid success Concert.క‌రోనాను జ‌యించిన నేప‌థ్యంలో న్యూజిలాండ్ వేడుక చేసుకుంది. 50 వేల మందితో

By Medi Samrat  Published on  25 April 2021 10:54 AM GMT
Newzeland grand party

ప్రపంచంలో చాలా దేశాలు కరోనా మహమ్మారిని కట్టడి చేసేశాయి. చాలా దేశాల్లో కఠినమైన నిబంధనలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కూడా వీలైనంత వేగంగా నిర్వహించడంతో కరోనాను కట్టడి చేసేశారు. అలాగే కొన్ని దేశాల్లో అతి తక్కువ జనాభా కూడా ఉండడంతో కరోనా కట్టడి వీలైంది. అలా కరోనాను కట్టడి చేసిన దేశాల్లో మాస్కులు కూడా లేకుండా ప్రజలు తిరిగేస్తూ ఉన్నారు. కరోనాను కట్టడి చేసిన దేశాల్లో న్యూజిలాండ్ కూడా ముందుంది. తాజాగా ఆ దేశంలో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు.. అందుకు కారణం కరోనాను జయించామని తెలియజేయడానికే..!

క‌రోనాను జ‌యించిన నేప‌థ్యంలో న్యూజిలాండ్ వేడుక చేసుకుంది. 50 వేల మందితో న్యూజిలాండ్‌లోని అతిపెద్ద ఈడెన్ పార్క్ స్టేడియం (ఆక్లాండ్‌)లో లైవ్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వ‌హించారు. క‌రోనాను జ‌యించ‌డంతో తాము ఇక భౌతిక దూరం, మాస్కులు పెట్టుకోవ‌డం వంటి నిబంధ‌న‌లు పాటించాల్సిన అవ‌స‌రం లేద‌ని న్యూజిలాండ్ ప్ర‌జ‌లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్లు అంద‌రూ ఆడుతూపాడుతూ ఎంజాయ్ చేశారు. తాము ఎప్ప‌టిలాగే సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌ప‌గ‌ల‌మ‌ని నిరూపించుకున్నామ‌ని ఆక్లాండ్ మేయ‌ర్ ఫిల్ గోఫ్ అన్నారు.


Next Story