ప్రభుత్వం కీలక నిర్ణయం.. 16 ఏళ్ల‌కే ఓటు హ‌క్కు.!

New Zealand considering law to allow 16-year-olds to vote. 16 ఏళ్ల వయస్సు రాగానే ఓటు హక్కు కల్పించనుంది న్యూజిలాండ్‌ దేశం. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం కొత్త

By అంజి  Published on  22 Nov 2022 5:36 AM GMT
ప్రభుత్వం కీలక నిర్ణయం.. 16 ఏళ్ల‌కే ఓటు హ‌క్కు.!

16 ఏళ్ల వయస్సు రాగానే ఓటు హక్కు కల్పించనుంది న్యూజిలాండ్‌ దేశం. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. 16 ఏళ్లు రాగానే ఓటు హక్కు వస్తుంది. ఓటు హక్కు వయసు తగ్గించేందుకు విధి విధానాలపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఓటరు వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని న్యూజిలాండ్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ జెసిండా ఆర్డెర్స్‌ భావిస్తున్నారు. త్వరలోనే ఈ చట్టాన్ని తీసుకువస్తానని పార్లమెంటులో ప్రధాని జసిందా ఆర్డెర్న్ హామీ ఇచ్చారు.

ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఓటు హక్కును పొందాలంటే 18 ఏళ్ల వయసు ఉండాలి. న్యూజిలాండ్‌ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఓ తీర్పు ఆధారంగా జెసిండా సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 18 ఏళ్లు దాటిన వాళ్లకే ఓటు హక్కు కల్పించడం అంటే యువత మానవ హక్కుల్ని ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఓ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే ఓటు హ‌క్కు వ‌య‌సును తగ్గించేందుకు ఆ దేశ ప్రధానమంత్రి జెసిండా ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌భుత్వం పాస్ చేసే బిల్లుకు పార్ల‌మెంట్‌లోని 75 శాతం మంది ఎంపీలు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బిల్లు చట్ట రూపం దాల్చుతుంది. అయితే బిల్లుకు మద్దతు తెలిపే ఎంపీల సంఖ్య జెసిండాకు లేదు. వాతావ‌ర‌ణ మార్పులు లాంటి అంశాల‌పై యువ‌కులు ఓటు వేయాల్సి ఉంటుంద‌ని న్యూజిలాండ్ కోర్టు పేర్కొన్న‌ది. బ్రెజిల్‌, ఆస్ట్రియా, క్యూబా దేశాలు మాత్రమే 18 ఏళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌సున్న వారికి ఓటు వేసే హ‌క్కును కల్పిస్తున్నాయి.

Next Story