కుక్క‌ల నుండి మ‌నుషుల‌కు.. మ‌లేషియాలో కొత్త‌ర‌కం క‌రోనా..

New corona virus from dogs in Malaysia.కరోనాలో మరో రకం వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. మలేసియాలో వెలుగుచూసిన ఈ వైరస్ కుక్కల నుంచి మనుషుల్లోకి చొరబడుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

By Medi Samrat  Published on  23 May 2021 9:42 AM GMT
new corona variant in malasiya

ఇందు గలడందు లేడని సందేహము వలదు.. నేను ఏదో భగవంతుడు గురించి స్టోరీ చెప్తున్నాను అనుకోకండి. నేను చెబుతున్నది కరోనా వైరస్ గురించే. అబ్బే.. మనుషులకు మాత్రమే వస్తుంది జంతువులకు రాదు అన్నారు.. హమ్మయ్య పర్లేదు సేఫ్ అనుకున్నాం. కానీ ఇప్పుడు కరోనా వైరస్ రోజుకొక ట్విస్ట్ ఇస్తోంది. కరోనాలో మరో రకం వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. మలేసియాలో వెలుగుచూసిన ఈ వైరస్ కుక్కల నుంచి మనుషుల్లోకి చొరబడుతోందని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మలేసియాలోని సార్వాక్‌ కు చెందిన ఓ ఆస్పత్రిలో 301 రోగుల నుంచి తీసుకున్న నమూనాలను పరీక్షించగా 8 మందిలో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు.

అయితే దీనివల్ల మనుషులకు ప్రమాదం జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. ఈ వైరస్‌కు శాస్త్రవేత్తలు సీసీవోవీ-హెచ్‌యూపీఎన్-2018 అని పేరుపెట్టారు. కరోనా కారక సార్స్‌కోవ్-2 తర్వాత మానవుల్లోకి వచ్చిన ఈ వైరస్ సాధారణం గా ఈ కరోనా వైరస్‌ పిల్లులు, పందులకు వ్యాపిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కుక్కలు కూడా దీని బారిన పడతారని వారు పేర్కొన్నారు. 2017-18 మధ్య న్యూమోనియా బారినపడి కొందరు బాధితుల నమూనాలను పరీక్షించగా..ఈ వైరస్ వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అయితే ఈ వైరస్ కుక్కల నుంచి మనుషులకు వచ్చిన తరువాత మళ్ళీ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా? అనేది మరింత అధ్యయనం చేయాల్సి ఉంది. అయితే ఇలాంటి వైరస్‌లు అప్పటికప్పుడు ఎలాంటి రాద్దాంతాలు సృష్టించవు గానీ ఎదుటి మనిషి శరీరంలోని రోగ నిరోధకశక్తికి అనుగుణంగా తమ రూటు మార్చేసుకుంటాయి. అయితే ఈ కొత్త వైరస్ కుక్కల నుంచి మనుషుల్లోకి సోకినా పెద్ద ప్రమాదకరం కాదని సైంటిస్టులు చెబుతున్నారు.


Next Story