భారత టూరిస్ట్‌లపై నేపాల్‌ నిషేధం.. ఆ కారణంగానే..

Nepal Bars Entry Of Indians After 4 Tourists Test Covid Positive. కొన్ని రోజులుగా భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌ నుంచి వచ్చే టూరిస్ట్‌లపై నేపాల్‌ నిషేధం

By అంజి  Published on  10 Aug 2022 5:07 AM GMT
భారత టూరిస్ట్‌లపై నేపాల్‌ నిషేధం.. ఆ కారణంగానే..

కొన్ని రోజులుగా భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌ నుంచి వచ్చే టూరిస్ట్‌లపై నేపాల్‌ నిషేధం విధించింది. ఇటీవల నేపాల్‌కు వచ్చిన నలుగురు భారతీయుల్లో కరోనా పాజిటివ్‌ నిర్దారణ కావడంతో వారిని నేపాల్‌ ప్రభుత్వం వెనక్కి పంపిస్తూ ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నలుగురు ఝులాఘాట్‌ బార్డర్‌ ఏరియా నుంచి నేపాల్‌లోని బైతాడీ జిల్లాలోకి ప్రవేశించారు. వారికి కరోనా పరీక్షలు చేయించామని, అందులో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు నేపాల్‌ అధికారి ఒకరు తెలిపారు. అలాగే భారత్‌ నుంచి తిరిగి వచ్చిన నేపాల్‌ చెందిన పలువురికి కరోనా బారినపడినట్లు పేర్కొన్నారు. వైరస్‌ విజృంభణ జరగకుండా ముందు జాగ్రత్తగా.. భారత టూరిస్ట్‌లను నేపాల్‌లోకి ప్రవేశించకుండా నిలిపివేసినట్లు చెప్పారు.

బైతాడిలోని హెల్త్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ బిపిన్ లేఖక్ మాట్లాడుతూ.. నలుగురు భారతీయ పౌరులు కోవిడ్‌కు పాజిటివ్ వచ్చిందని, వారిని భారత్‌కు తిరిగి పంపించామం. అలాగే ఇక్కడ ఉన్న భారతీయులపై కోవిడ్ పరీక్షలు కూడా చేస్తున్నాం" అని మిస్టర్ లేఖక్ చెప్పారు. భారత్‌ సరిహద్దులో ఉన్న బైతాడి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బైతాడిలో 31 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక్కడ మూడు వారాల క్రితం వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

ఇక భారత్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. నిన్న దేశ వ్యాప్తంగా 3,25,081 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 16,047 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. గత 24 గంటల్లో 54 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో చ‌నిపోయిన వారి సంఖ్య 5,26,826కి చేరింది.

Next Story