మయన్మార్‌లో రెచ్చిపోతున్న సైన్యం.. ఒక్క‌రోజే 114 మంది తూటాల‌కు బ‌లి

Myanmar forces kill over 100 in deadliest day since coup. మయన్మార్ లో సైనిక అరాచకం తీవ్రస్థాయికి చేరింది. ప్రజాస్వామ్య అనుకూల వాదులు పై కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించింది.

By Medi Samrat  Published on  28 March 2021 3:42 AM GMT
Myanmar news

మయన్మార్ లో సైనిక పాలన హద్దులు దాతుతోంది. సాయుధ బలగాల దినోత్సవం రోజున అక్కడి సైనిక అరాచకం తీవ్రస్థాయికి చేరింది. ప్రజాస్వామ్య అనుకూల వాదులు పై కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించింది.

దాదాపు రెండు నెలలుగా మాయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ప్రజలపై సైన్యం అణచివేత ధోరణి కొనసాగుతోంది. ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన నివేదికలో తేలింది. తుపాకీతో కాల్చడం వల్లే 90 శాతం మంది చనిపోయారని వివరించింది. ఒక్క శనివారమే 114 మంది ఆందోళనకారులు సైన్యం తూటాలకు బలయ్యారు.

చనిపోయిన వారిలో అత్యధికంగా చిన్న పిల్లలే ఉన్నారు. మయన్మార్‌లోని మాండలేలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 29 మంది చెందారని, యాంగోన్ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో దాదాపు 24 మంది చనిపోయారని, అలాగే సెంట్రల్ సాగింగ్ ప్రాంతంలోనూ పలువురు ప్రాణాలు కోల్పోయారని మయన్మార్ మీడియా వెల్లడించింది.

సైనిక తిరుబాటును వ్యతిరేకిస్తూ యమన్మార్ దేశ ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ ప్రజలు ఆందోళనలు చేయడం, సాయుధ బలగాలు వారిపై దాడి చేసి అణచివేయడం జరుగుతూనే ఉంది. అత్యంత దారుణంగా వ్యవహరిస్తోన్న సైనిక ప్రభుత్వం.. తన చర్యలను సమర్ధించుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించి, ప్రజలను కాపాడటానికే ప్రయత్నిస్తున్నామని సైనిక ప్రభుత్వాధినేత జుంటా ప్రకటించాడు.

ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్ ప్రభుత్వాన్ని కాదని ఆదేశ సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆదేశ ప్రజలు నిత్యం నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కూడా అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరింత రెచ్చిపోయిన అక్కడి పోలీసు అధికారులు.. ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. సైన్యం దాడిలో రెండు నెలల్లో చనిపోయిన వారి కంటే ఇవాళ చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ అని అక్కడి మీడియా వర్గాల సమాచారం.Next Story