అటు యుద్ధం.. ఇటు ట్రెండింగ్‌లో మియా ఖలీఫా
ఓ వైపు ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంటే.. మరో వైపు నటి, మోడల్ మియా ఖలీఫా పేరు ట్రెండింగ్‌గా మారింది.
By అంజి Published on 10 Oct 2023 8:38 AM ISTఅటు యుద్ధం.. ఇటు ట్రెండింగ్‌లో మియా ఖలీఫా
ఓ వైపు ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంటే.. మరో వైపు నటి, మోడల్ మియా ఖలీఫా పేరు ట్రెండింగ్‌గా మారింది. దీనికి కారణం ఆమె పాలస్తీనాకు సపోర్ట్ చేయడమే. పాలస్తీనాకు ఆమె మద్దతు తెలపడంతో సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. మియా ఖలీఫా ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధం మధ్య తన అభిప్రాయాలను ఎక్స్ వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె ఆన్‌లైన్ ట్రెండ్స్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మాజీ అడల్ట్ ఫిల్మ్ నటి పాలస్తీనాకు మద్దతుగా ఎక్స్‌లో పోస్ట్‌లు చేసింది. అలాగే ఆమె ఇజ్రాయెల్ అనుకూలంగా పోస్ట్ చేయడంపై కైలీ జెన్నర్‌పై కూడా విరుచుకుపడింది.
హమాస్ ఉగ్రవాదులు శనివారం ఇజ్రాయెల్‌లోకి చొరబడి గాజా నుండి 3,000 కంటే ఎక్కువ రాకెట్‌లను ప్రయోగించినప్పటి నుండి ఇప్పటివరకు ఇజ్రాయెల్, గాజాలో 1,100 మందికి పైగా మరణించారు. సరిహద్దు దాటుకుని ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి, విధ్వంసం సృష్టించింది. ఆకస్మిక దాడి నుంచి ఆలస్యంగా తేరుకున్న ఇజ్రాయెల్ ప్రస్తుతం ప్రతిఘటిస్తోంది. కాగా ఈ యుద్ధంలో హమాస్‌లకు మియా ఖలీఫా మద్దతు ప్రకటించడంపై పలువురు మండిపడుతున్నారు.
“మీరు పాలస్తీనాలోని పరిస్థితిని చూసి, పాలస్తీనియన్ల వైపు ఉండకపోతే, మీరు వర్ణవివక్ష యొక్క తప్పు వైపున ఉన్నారని అర్థం, కాలక్రమేణా చరిత్ర అసలు విషయాన్ని చూపిస్తుంది” అని మియా అక్టోబర్ 7 న షేర్ చేసిన మొదటి పోస్ట్ వైరల్ అయ్యింది. దీనికి 20 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ ట్వీట్ వెంటనే వైరల్‌గా మారడంతో.. అప్పటి నుంచి మియా ఖలీఫాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇజ్రాయెల్ పరిస్థితిని చూసిన తర్వాత కూడా.. మతంతో మీ కళ్లు మూసుకుని పోతే.. అప్పుడు నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నట్టు అర్థం అని ఆ ట్వీట్‌కు ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఇలా చాలా నెగిటివ్ కామెంట్లే ఉన్నాయి. వీటిలో కొన్ని కామెంట్లకు మియా ఆన్సర్ కూడా ఇచ్చింది.
ఇజ్రాయెల్‌కు అనుకూలంగా మీడియా పర్సన్ కైల్ జెన్నర్ పోస్ట్ చేసింది. తాము ఎల్లప్పుడూ ఇజ్రాయెల్ ప్రజల వెన్నంటే ఉంటామని తెలిపింది. ఆ కాసేపటికే పోస్ట్‌ని డిలీట్ చేసింది. ఇంతలో కైల్ పోస్ట్‌పై మియా ఖలీఫా కాస్త ఘాటుగానే స్పందించింది. "నిజమైన జర్నలిజం జీవిస్తూ ఉంటే.. ఎవరైనా వెళ్లి మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న భౌగోలిక ఉద్రిక్తతల గురించి ప్రశ్నించాలి. తన 40మిలియన్ మంది ఫాలోవర్ల కోసం తాపత్రయపడుతున్న కైల్.. చూపు తిప్పుకోకుండా సమాధానం ఇవ్వాలి" అని మియా ఖలీఫా కామెంట్ చేసింది. ఈ కామెంట్‌కు మియాకు కొందరు మద్దతు తెలిపారు. వారు ఆమె అభిప్రాయాల కోసం కైలీపై విరుచుకుపడ్డారు.
“పాలస్తీనాకు మద్దతు ఇవ్వడం వల్ల నా వ్యాపార అవకాశాలు కోల్పోయాయి, కానీ నేను ఇలాంటి వారితో వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నానా లేదా అని తనిఖీ చేయనందుకు నాపై నాకు కోపం వచ్చింది. నా దురదృష్టం" అని మియా పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో కూడా మియా ఒక క్లిప్‌ను పోస్ట్ చేసింది, అందులో "హమాస్ కారణంగా ఆక్రమణ జరగడం లేదు" అని చెప్పింది.
హమాస్ అనేది పాలస్తీనా ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్, ఇది 2007 నుండి గాజా స్ట్రిప్‌ను పాలిస్తోంది. గాజా స్ట్రిప్‌లో దాదాపు 2.3 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది ఇజ్రాయెల్, ఈజిప్ట్, మధ్యధరా సముద్రంతో చుట్టుముట్టబడిన 41 కిమీ పొడవు మరియు 10 కిమీ వెడల్పు గల భూభాగం. గాజా స్ట్రిప్‌లోని హమాస్ రహస్య స్థావరాలను తుడిచిపెట్టడానికి ఇజ్రాయెల్ శనివారం ఎదురుదాడి ప్రారంభించింది, సమూహం ఇజ్రాయెల్‌లోకి 5,000 రాకెట్‌లను ప్రయోగించింది. దాని సభ్యులు భూమి, వాయు , సముద్రం ద్వారా దేశంలోకి చొరబడ్డారు. మూడు రోజుల పోరాటంలో ఇప్పటికే 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు.