ప్రియాంకను టార్గెట్ చేసిన మాజీ పోర్న్ స్టార్

Mia Khalifa asks why Priyanka Chopra is silent on farmers' protests. ఇండియాలో జరుగుతోన్న రైతు ఉద్యమం విషయంలో ప్రియాంక చోప్రా ఎందుకు మౌనం వహిస్తున్నారని మియా ప్రశ్నించింది.

By Medi Samrat  Published on  9 Feb 2021 4:14 AM GMT
Mia Khalifa asks why Priyanka Chopra is silent on farmers protests

భారత్ లో రైతుల ఉద్యమానికి మద్దతుగా అంతర్జాతీయంగా పలువురు ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. వారిపై భారత్ కు చెందిన కొందరు సెలెబ్రిటీలు ఇది మా దేశ సమస్య.. మీకు అనవసరం అని చెప్పారు. భారత వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం అవసరం లేదని భారత సెలబ్రిటీలు, ప్రముఖులు చేస్తున్న ట్వీట్లను ఎదుర్కొనేందుకు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఏకమవుతున్నారు. మాజీ పోర్న్ స్టార్ మియా కలీఫా, మోడల్ అమందా సెర్నీ, కెనడా ఎంపీ జగమీత్ సింగ్ తదితరులు ఒకే మాటపై నిలిచి, తమపై విమర్శలు చేస్తున్న వారిని ఎదుర్కొంటున్నారు.

మియా కలీఫా ట్వీట్ చేస్తూ, సాక్ష్యం లేకుండా విమర్శిస్తున్నామని తమపై రెచ్చిపోతున్న వారికి, ఇండియాలో రైతుల బాధ తెలియడం లేదా? అని ప్రశ్నించారు. తామంతా సిక్కు వేర్పాటువాదుల నుంచి డబ్బు తీసుకున్నామని ఆరోపించేందుకు మీ వద్ద ఏం సాక్ష్యాలున్నాయని ఆమె ప్రశ్నించారు. తాజాగా ప్రియాంక చోప్రాను టార్గెట్ చేస్తూ, ఆమెను అవమాన పరుస్తూ ట్వీట్ చేసింది. 'మిసెస్ జోనస్' అని ప్రియాంక చోప్రా జోనస్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఒక ప్రశ్నను సంధించింది. ఇండియాలో జరుగుతోన్న రైతు ఉద్యమం విషయంలో ప్రియాంక చోప్రా ఎందుకు మౌనం వహిస్తున్నారని మియా ప్రశ్నించింది.


ఈ మేరకు సోమవారం ఒక ట్వీట్ చేసింది. ''మిసెస్ జోనస్ ఏ క్షణంలోనైనా తన మౌనాన్ని వీడబోతున్నారా? నాకు చాలా ఆత్రుతగా ఉంది. బీరుట్ పేలుళ్ల సమయంలో షకీరా స్పందన కోసం నేను వేచి చూసినట్టే ఇప్పుడు అనిపిస్తోంది. నిశ్శబ్దం'' అని మియా ఖలీఫా తన ట్వీట్‌లో తెలిపింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో భారీ పేలుళ్లు సంభవించినప్పుడు పాప్ స్టార్ షకీరా స్పందించలేదు.. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా అలాగే మారిపోయింది అన్నది మియా ఖలీఫా వాదన.



ఈ అంశంపై ప్రియాంక చోప్రా ఇంతకు ముందే స్పందించింది. గతేడాది డిసెంబర్‌లో రైతు ఉద్యమంపై ప్రియాంక చోప్రా ట్వీట్ చేస్తూ.. మన రైతులు భారత్‌కు ఆహారాన్ని అందించే సైనికులని.. వారి భయాలను తొలగించాల్సిన అవసరం ఉందని.. వారి ఆశలు నెరవేరాలని.. అభివృద్ధి చెందుతోన్న ఒక ప్రజాస్వామ్యంగా మనమంతా ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని పిలుపునిచ్చారు.




Next Story