మిస్ యూనివర్స్ గా ఆండ్రియా మెజా.. భారత సుందరికి నిరాశే..
Mexico's Andrea Meza Crowned Miss Universe 2021. ప్రపంచ సుందరి కిరీటాన్ని 26 ఏళ్ల మెక్సికో భామ అండ్రియా మెజా సొంతం చేసుకుంది.
By Medi Samrat Published on 17 May 2021 5:46 AM GMTప్రపంచ సుందరి కిరీటాన్ని 26 ఏళ్ల మెక్సికో భామ అండ్రియా మెజా సొంతం చేసుకుంది. 2020 సంవత్సరానికి గానూ ఫ్లోరిడాలో నిర్వహించిన 69వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. ఆండ్రియాకు మాజీ విశ్వ సుందరి, దక్షిణాప్రికాకు చెందిన జోజిబిని తుంజి కిరిటాన్ని బహూకరించారు. ఆమె విజయాన్ని అధిరోహించడానికి కారణమైన ప్రశ్న ఏంటంటే.. మీరు ఏ దేశానికి నాయకులైతే, మీరు కోవిడ్-19 మహమ్మారితో ఎలా ఎదుర్కొంటారు. దీనికి ఆమె...'ఈ కోవిడ్ వంటి సంక్లిష్ట పరిస్థితిని నిర్వహించడానికి సరైన మార్గం లేదని తాను విశ్వసిస్తానని, లాక్‌డౌన్ మాత్రమే సృష్టించగలుగుతాను. అయినప్పటికీ అనేక మంది చనిపోయారు. ఇది భరించలేని అంశం. అందుకే ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటాను' అంటూ సమాధానమిచ్చారు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఈపోటీకి హాజరైన 73 మంది సుందరీమణులను వెనక్కునెట్టి 69 వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఆండ్రియా మెజా గెలుచుకున్నారు.
ఈ పోటీలో రెండవ రన్నరప్‌గా మిస్ పెరూ జెనిక్ మాచెట్టా నిలిచారు. మిస్ ఇండియా అడ్లైన్ కాస్టెలినో ఈ మిస్ యూనివర్స్ కిరీటానికి కొద్ది అడుగుల దూరంలో ఆగిపోయారు. టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్న అడ్లైన్ కాస్టెలినో.. మూడవ రన్నరప్‌గా నిలిచారు. కరోనా మహమ్మారి కారణంగా 2020లో ప్రపంచ సుందరి పోటీలను ఆపివేసిన సంగతి తెలిసిందే..!
ఈ పోటీల్లో మిస్ మయన్మార్ తూజార్ వింట్ లిన్ (Miss Myanmar Thuzar Wint Lwin) అందరినీ ఆకర్షించింది. ఆమె తమ దేశంలో సైనికుల ఆగడాలకు సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని.. ప్రతి రోజూ వందల్లో మరణిస్తూ ఉన్నారని చెప్పుకొచ్చింది. తమ దేశ సమస్యను ప్రపంచం ముందు మరోసారి బయట పెట్టింది. ఆమె టాప్ 21లో చోటు సంపాదించుకుంది. ఆమెకు బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ అవార్డు లభించింది.