మెక్సికోలో భారీ భూకంపం

Mexico Hit by Powerful Earthquake.మెక్సికో దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ప‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sep 2021 4:36 AM GMT
మెక్సికోలో భారీ భూకంపం

మెక్సికో దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ప‌లు భ‌వ‌నాలు ఊగిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో రిసార్టుకు 11 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉంద‌ని నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 7.1గా న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించింది. ఈ భూకంపం ధాటికి దాదాపు 200 మైళ్ల దూరంలో ఉన్న మెక్సికో నగరంలోని ఇండ్లు, భవనాలు ఊగిపోయాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఒక నిమిషం కంటే ఎక్కవ సేపు భూమి కంపించింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. భ‌వ‌నాలు ఊగ‌డంతో అందులోని ప్ర‌జ‌లు భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

కాగా.. ఈ భూకంపం కార‌ణంగా భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ఎలాంటి స‌మాచారం అంద‌లేద‌ని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ ట్వీట్ చేశారు. కాగా.. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో మెక్సికో ఒకటి. 1985 సెప్టెంబర్‌ 19న 8.1 తీవ్రతతో భూమి కంపించింది. ఆ స‌మ‌యంలో 10వేల మందికి పైగా మ‌ర‌ణించారు.

Next Story