75వ స్వాతంత్య్ర దినోత్సం: అంతరిక్షం నుంచి భారత్‌కు స్పెషల్‌ విషెస్‌

Message from space on India's 75th year of Independence. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారత్‌కు.. ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

By అంజి  Published on  13 Aug 2022 12:41 PM IST
75వ స్వాతంత్య్ర దినోత్సం: అంతరిక్షం నుంచి భారత్‌కు స్పెషల్‌ విషెస్‌

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారత్‌కు.. ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌కు అంతరిక్షం నుంచి స్పెషల్‌ విషెస్‌ వచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న.. భారత మూలాలున్న ఇటాలియన్‌ ఆస్ట్రోనాట్‌ సమంతా క్రిస్టోఫోరెట్టి.. భారత్‌కు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఏడాది పొడవునా జరుపుకుంటున్న 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల చారిత్రాత్మక క్షణాన్ని ఆమె అభినందించారు.

''75 ఏళ్ల స్వాతంత్య్రానికి భారత దేశానికి అభినందనలు తెలియజేయడం ఆనందంగా ఉంది. దశాబ్దాలుగా అంతర్జాతీయ స్పెస్‌ ఏజెన్సీలు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో కలిసి అనేక అంతరిక్ష, సైన్స్ మిషన్‌లలో పనిచేశాయి'' అని వ్యోమగామి సమంత వీడియో సందేశంలో తెలిపారు. 2023లో ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌కు ఓ వీడియో సందేశం పంపించారు.

మానవులను అంతరిక్షంలో పంపించడానికి ఇస్రో మొదటిసారిగా చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ ఏజెన్సీ, నాసా, అంతర్జాతీయ భాగస్వాముల పక్షాన కోరుకుంటున్నానని చెప్పారు. ఇస్రో అభివృద్ధి చేస్తున్న రెండు పెద్ద ప్రాజెక్టుల గురించి ఆమె మాట్లాడుతూ.. " ఎర్త్ సైన్స్ మిషన్ అభివృద్ధికి కృషి చేస్తున్నందున ఇస్రోకు ఈ సహకారం కొనసాగుతుంది. ఈ ఎర్త్‌ సైన్స్‌ మిషన్‌ మారుతున్న వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, విపత్తులను గుర్తించడానికి సహాయపడుతుంది అని అన్నారు.


Next Story