షాకింగ్: ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి ప్రత్యక్షం!

Man finds the image of dad on Google Earth 7 years after he died. సాధారణంగా మనం ఎంతో ఆత్మీయులుగా భావించే వ్యక్తులు మన నుంచి

By Medi Samrat  Published on  10 Jan 2021 7:14 AM GMT
google earth

సాధారణంగా మనం ఎంతో ఆత్మీయులుగా భావించే వ్యక్తులు మన నుంచి దూరం అయితే ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది.వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జీవితాంతం గడుపుతుంటారు. ఆ విధంగా మరణించిన మన ఆత్మీయులు తిరిగి ఒక్కసారి కనిపిస్తే ఎలా ఉంటుంది? వారు కనిపించిన ఆ క్షణం ఎంతో పట్టరాని సంతోషం ఉంటుంది. అలాంటి ఘటన ఒకటి జపాన్ లో చోటు చేసుకుంది. ఏడేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి "గూగుల్ ఎర్త్" లో కనిపించడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...

జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల టైంపాస్ కోసం గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి తన తల్లిదండ్రుల ఇల్లు ఎలా ఉందో చూడాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి లొకేషన్ టైప్ చేయగా అతనికి తన ఇంటి ముందు తన తండ్రి నిలబడి ఉండటం కనిపించడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్వేగానికి గురి అయ్యాడు. ఏడేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి ఆ విధంగా తన ఇంటి ముందు నిల్చొని ఉండడంతో అతనిలో పట్టరాని సంతోషం కలిగింది.

ఏడేళ్ల తర్వాత తన ఇంటి ముందు తన తండ్రి కనిపించడంతో వెంటనే ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు."ఏడేళ్ల క్రితం చనిపోయిన నా తండ్రిని చూసా.. అందులో అమ్మ, నాన్న వద్దకు నడుస్తున్నట్లుగా ఉంది. బహుశా.. నాన్న అమ్మ కోసం రోడ్డు పక్కన ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. అని పోస్ట్ చేశాడు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గూగుల్ ఎర్త్ మ్యాప్ ఇప్పటికీ కూడా అప్డేట్ చేయకపోవడంతో ఏడు సంవత్సరాల క్రితం చనిపోయిన నా తండ్రిని మరి చూసుకోగలిగా అంటూ ఆ వ్యక్తి తెలియజేశాడు. అయితే అతను ఈ విషయం ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.


Next Story