భార్యను అలా చూసి.. పెళ్లైన నెల రోజులకే విడాకులు కోసం కోర్టుకు
Man divorces wife after seeing her first time without make-up.ఫేస్‌బుక్‌లో అందమైన ఫోటోలు చూసి మనసు పారేసుకున్నాడు.
By తోట వంశీ కుమార్ Published on 30 Oct 2021 2:50 PM ISTఫేస్‌బుక్‌లో అందమైన ఫోటోలు చూసి మనసు పారేసుకున్నాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగి నెలరోజులైనా కాలేదు. ఈ భార్య నాకొద్దు అంటూ అతడు కోర్టు మెట్లు ఎక్కాడు. వివాహం అయిన తరువాత భార్యను మేకప్ లేకుండా చూసి ఈ నిర్ణయం తీసుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన దుబాయ్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఓ ఈజిప్టియన్ దుబాయ్‌లో నివసిస్తున్నాడు. అతడు ఫేస్‌బుక్‌లో ఓ యువతిని చూసి మనస్సు పారేసుకున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన తరువాతి రోజు ఉదయం భార్యను మేకప్ లేకుండా చూసి షాక్ అయ్యాడు. తాను చేసుకుంది ఈమెనేనా అనే అనుమానం అతడికి కలిగిందట. ఆమె చాలా అందవికారంగా ఉండడమే అందుకు కారణమట. వెంటనే విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
'ఫేస్‌బుక్ ద్వారా మా ఇద్దరికి పరిచయమైంది. అందులో అందమైన ఫోటోలు పెట్టేది. ఆమెను బయట చాలా సార్లు కలిసాను. అయితే.. మేకప్ ఉండడంతో చాలా అందంగా కనిపించేంది. దాంతో పెళ్లిచేసుకున్నాను. తరువాతి రోజు ఉదయం మొదటి సారి మేకప్ లేకుండా చూసి నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. ఆమెను అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఇన్ని రోజులు నేను కలిసి ఉంది ఈమెతోనేనా అని కొద్ది సేపు షాక్‌కు గురైయ్యాను. నా భార్య చూడడానికి చాలా అందహీనంగా ఉంది. నాకు విడాకులు కావాలి' అని ఈజిప్టియన్ కోర్టులో తన గోడును వెళ్లబోసుకున్నాడు.