డేటింగ్ యాప్‌ల యుగంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఒక పాకిస్తానీ వ్యక్తి తన లైఫ్‌ పార్టనర్‌ కోసం బిల్‌బోర్డ్‌ను ఆశ్రయించాడు. తనకు లైఫ్‌ పార్టనర్‌ను చూడంటూ ప్రకటనలు ఇచ్చాడు. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే లండన్, బర్మింగ్‌హామ్ వీధుల్లోని ప్రజలు బిల్‌బోర్డ్‌లపై ఒక వ్యక్తిని చూసి, ఊదారంగు తెరపై పడుకుని.. "అరెంజ్డ్ మ్యారేజ్ నుండి నన్ను రక్షించండి" అని ఒక లైన్‌ ఉంది. దానిని చూసిన ప్రజలు మొదట ఆశ్చర్యపోయి.. ఆ తర్వాత నవ్వుకున్నారు. బిల్‌బోర్డ్‌పై గడ్డం ఉన్న యువకుడితో పాటు, నల్లటి స్కల్ క్యాప్ ధరించి.. 'ఫైండ్ మాలిక్ ఏ వైఫ్' అనే వెబ్‌సైట్‌కి లింక్ ఉంది.

ఒక చూపులో ఇది చిలిపి లేదా జోక్ లాగా అనిపించవచ్చు. కానీ వెబ్‌సైట్‌ని ఒక్కసారి చూస్తే విషయాలు క్లియర్ అవుతాయి. వాస్తవానికి తనకు కాబోయే జీవిత భాగస్వామిని కనుగొనడానికి మాలిక్‌ చేస్తున్న ప్రయత్నం ఇది. "నాకు ఇంకా సరైన అమ్మాయి దొరకలేదు. కాబోయే భార్యను వెతుక్కోవడం చాలా కష్టంగా మారింది. కానీ చివరకు జీవిత భాగస్వామి కోసం బిల్‌బోర్డ్‌ని ఆశ్రయించాను'' అని ముహమ్మద్ మాలిక్ తన వెబ్‌సైట్‌లో ఉంచాడు. మాలిక్‌ బిల్‌బోర్డ్‌ ప్రకటనతో వేలాది మంది అమ్మాయిలు అతడి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. అయితే ఆ వివరాలను పరిశీలించడానికి తనకు తగిన సమయం దొరకడం లేదని మాలిక్‌ వాపోయాడు.అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story