మాల్దీవులలో మనకి నో ఎంట్రీ.. ఎందుకంటే..

Maldives tightens curfew, bans India tourists. భారత పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు మాల్దీవులల ప్రకటించింది.

By Medi Samrat  Published on  12 May 2021 2:46 PM IST
Maldives

ఇలా కరోనా కాస్త బ్రేక్ ఇచ్చిందో లేదో.. తెగ తిరిగేసారు మాల్దీవులకి.. అక్కడి హోటల్లు కూడా ఏం తక్కువ చెయ్యకుండా రండి బాబు రండి మా హోటల్లో స్టే చేస్తే అది ఫ్రీ, ఇది ఫ్రీ అని చెప్పి బాగా డబ్బులు, పబ్లిసిటీ ని సంపాదించుకున్నాయి.. ఇప్పుడు మాత్రం అన్ని సైలెంట్ అయిపోయాయి. ఇండియా పేరు వింటేనే ముఖం పక్కకు తిప్పేసుకుంటున్నాయి.

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ సూపర్ డూపర్ హిట్టు కొట్టడంతో అనేక దేశాలు భారత్ కు రాకపోకలు నిలిపివేశాయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే వారిపై ఆంక్షలు విధించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో మాల్దీవులు కూడా చేరింది. భారత పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం మే 13 నుంచి అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మాల్దీవులు ఇమ్మిగ్రేషన్ విభాగం ట్విట్టర్ లో తెలిపింది.

మాల్దీవుల్లోకి దక్షిణాసియా దేశాలకు చెందిన పర్యాటకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అన్ని రకాల వీసాలకు ఈ నిబంధన వర్తిస్తాయని చెప్పింది. ఈ విషయం పై అక్కడి భారత హై కమిషన్‌ స్పందించింది.ఈ నిర్ణయం.. ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో భారతీయులు తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

నిజానికి సినిమావాళ్లు కాస్త టైం దొరికితే చాలు అయితే గోవా కి, లేకుంటే మాల్దీవులకి చక్కెస్తుంటారు. తాజాగా కరోనా మొదటి వేవ్ కి, 2 వ వేవ్ కి మధ్య వచ్చిన కాస్త టైం లో కూడా ఇదే పని చేసిన చాలామంది సెలబ్రిటీలు ఎంజాయ్ చెయ్యడంతో పాటూ విమర్శల పాలయ్యారు.


Next Story