ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం..
Magnitude 7.1 earthquake strikes Philippines.కరోనా మహమ్మారి తో పాటు ప్రకృతి విపత్తులు ఆందోళన కలిగిస్తున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on
12 Aug 2021 3:05 AM GMT

కరోనా మహమ్మారి తో పాటు ప్రకృతి విపత్తులు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస భూకంపాలు రావడం, పిడుగులు పడటం, వరదలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరోసారి భారీ భూకంపం వచ్చింది. ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరం మిండనోవాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1 గా నమోదైంది. పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరం, భూమికి 65.6 కిలోమీటర్ల ప్రకంపనలు లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
మరోవైపు అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం.. ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఫిలిప్పీన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ, సిస్మాలజీ భూకంప నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. అయితే.. భూకంపం కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు నివేదికలు అందలేదని తెలిపింది. కాగా.. పసిఫిక్ రింగ్‌లో ఉన్న ఫిలిప్పీన్స్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
Next Story