బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డా సిల్వా
Lula da Silva defeats Jair Bolsonaro to again become Brazil's president. బ్రెజిల్ దేశ నూతన అధ్యక్షుడిగా 77 ఏళ్ల లూయిజ్ ఇన్‌సియో లులా డా సిల్వా ఎన్నికయ్యారు.
By అంజి
బ్రెజిల్ దేశ నూతన అధ్యక్షుడిగా 77 ఏళ్ల లూయిజ్ ఇన్‌సియో లులా డా సిల్వా ఎన్నికయ్యారు. దీంతో వరుసగా మూడోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలని భావించిన జైర్ బోల్సనారో ఆశలకు గండిపడింది. లెఫ్టిస్ట్ వర్కర్స్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్, మాజీ అధ్యక్షుడు డా సిల్వా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తాజాగా దేశ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డా సిల్వా.. 51 శాతం ఓట్లతో బోల్సనారోపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బోల్సనారోకి 49 శాతం (5,82,05,917) ఓట్లు లభించాయి.
బోల్సోనారో లెక్కింపులో మొదటి అర్ధభాగంలో ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాత స్వల్ప తేడాతో బోల్సనారో ఓటమిపాలయ్యారు. బ్రెజిల్ చరిత్రలో అత్యంత ప్రజాధరణ పొందిన అధ్యక్షుడిగా డా సిల్వా పేరుగాంచారు. 2018లో డా సిల్వాను ఎన్నికల్లో పోటీ నుంచి పక్కన పెట్టారు. వివాదాస్పదమైన అవినీతి ఆరోపణలు రావడంతో 2010లో లులా డా సిల్వా అధ్యక్ష పదవినుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 18 నెలలపాటు జైలుశిక్ష అనుభవించాడు. 1970వ సంవత్సరంలో బ్రెజిల్‌లోని మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డా సిల్వా పోరాడారు.
బ్రెజిల్ దేశ 35వ అధ్యక్షుడిగా 2003 నుంచి 2010 వరకు పనిచేశారు. 2023న జనవరి 1న బ్రెజిల్ అధ్యక్షుడిగా డా సిల్వా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేశంలో శాంతిని నెలకొల్పడం డా సిల్వా ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అని బ్రెజిల్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డా సిల్వా తన 2003-2010 పదవీకాలంలో విస్తృతమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమాన్ని నిర్మించడంలో ఘనత పొందారు. ఇది పది మిలియన్ల మందిని మధ్యతరగతిలోకి తీసుకురావడానికి అలాగే ఆర్థిక వృద్ధికి అధ్యక్షత వహించడంలో సహాయపడింది. ఎన్నికలకు ముందు జరిగిన చాలా ఒపీనియన్ పోల్స్ డా సిల్వాకు ఆధిక్యాన్ని ఇచ్చాయి.
Democracia. pic.twitter.com/zvnBbnQ3HG
— Lula 13 (@LulaOficial) October 30, 2022