ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నగరాల జాబితా విడుదల.. భారత్ చోటు దక్కించుకుందా?
గ్లోబల్ వెల్త్ ట్రాకర్ అయిన హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నగరాల జాబితాను విడుదల చేసింది.
By అంజి Published on 19 April 2023 7:11 AM GMTప్రపంచంలోని టాప్ 10 సంపన్న నగరాల జాబితా విడుదల.. భారత్ చోటు దక్కించుకుందా?
గ్లోబల్ వెల్త్ ట్రాకర్ అయిన హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నగరాల జాబితాను విడుదల చేసింది. భారతదేశంలోని ఏ నగరం కూడా టాప్ 10 జాబితాలో చేరలేకపోయినప్పటికీ, సంపద పరంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్, చైనా అనే రెండు దేశాల నుండి నగరాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నగరాలు
ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నగరాల పూర్తి జాబితా ఇక్కడ ఉంది.
నగరం | దేశం |
న్యూయార్క్ నగరం | యూఎస్‌ఏ |
టోక్యో | జపాన్ |
బే ఏరియా | యూఎస్‌ఏ |
లండన్ | యూకే |
సింగపూర్ | సింగపూర్ |
లాస్ ఏంజెల్స్ | యూఎస్‌ఏ |
హాంగ్‌కాంగ్ | చైనా ప్రత్యేక పరిపాలన ప్రాంతం |
బీజింగ్ | చైనా |
షాంఘై | చైనా |
సిడ్నీ | ఆస్ట్రేలియా |
ఈ జాబితాలో న్యూయార్క్ నగరం అగ్రస్థానంలో ఉంది
న్యూయార్క్ నగరం ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరంగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇందులో 3.4 లక్షల మంది మిలియనీర్లు, 724 మంది సెంటి-మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇది అమెరికా ఆర్థిక కేంద్రం, ప్రపంచంలోని రెండు అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలకు నిలయంగా ఉంది. ఈ జాబితాలో రెండవ నగరం టోక్యో ఉంది. ఇది జపాన్ రాజధాని. 290,300 మిలియనీర్లు, 250 సెంటీ-మిలియనీర్లు, 14 బిలియనీర్లకు నిలయం. ఇది ఆసియాలో అత్యంత సంపన్న దేశం.
యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క రాజధాని నగరం అయిన లండన్, జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. ఇప్పటికీ ఐరోపాలో అత్యంత సంపన్న నగరంగా ఉంది. ఇది 258,000 మంది మిలియనీర్లు, 384 సెంటీ-మిలియనీర్లు, 36 బిలియనీర్లకు నిలయం. ఆస్ట్రేలియా ఖండంలో న్యూ సౌత్ వేల్స్ రాజధాని సిడ్నీ, ఆస్ట్రేలియా అత్యంత ధనిక నగరం. ఇది 126,900 మంది మిలియనీర్లు, 184 సెంటీ-మిలియనీర్లు, 15 మంది బిలియనీర్లకు నిలయం. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో, ఇది 10వ స్థానాన్ని ఆక్రమించింది.
భారతదేశంలోని ఏ నగరమూ టాప్ 10 జాబితాలో చేరలేకపోయినప్పటికీ, బెంగళూరు సంపద పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా నిలిచింది. బెంగళూరు 2012 నుండి 2022 వరకు సంపదలో బలమైన వృద్ధిని సాధించింది.