ట్విట్టర్ సీఈఓగా లిండా బాధ్యతల స్వీకరణ
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ట్విటర్ సీఈవో బాధ్యతల నుంచి 2022 డిసెంబర్‌లో తప్పుకోగా.. తాజాగా ట్విటర్ కొత్త సీఈవోగా
By అంజి Published on 5 Jun 2023 2:30 PM ISTట్విట్టర్ సీఈఓగా లిండా బాధ్యతల స్వీకరణ
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ట్విటర్ సీఈవో బాధ్యతల నుంచి 2022 డిసెంబర్‌లో తప్పుకోగా.. తాజాగా ట్విటర్ కొత్త సీఈవోగా లిండా యాకరినో ఇవాళ (సోమవారం) బాధ్యతలను స్వీకరించారు. ఇకపై ట్విటర్ బిజినెస్ కార్యకలాపాలను పూర్తిగా లిండానే చూసుకోనున్నారు. గతంలో ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ విభాగంలో లిండా చైర్‌పర్సన్‌గా పని చేశారు. ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ వైస్ ప్రెజిడెంట్.. జో బెనారోచ్‌ను లిండా తన టీంలో చేర్చుకున్నారు లిండా. జో బెనారోచ్.. లిండాకు ఎంతో నమ్మకమైన వ్యక్తి, అందుకే లిండా తన టీంలో చేర్చుకున్నారు. ఎలాన్ మస్క్ కేవలం ప్రొడక్ట్ డిజైన్, కొత్త సాంకేతికపై దృష్టి సారిస్తారు. అలాగే టెస్లా, స్పేస్ ఎక్స్‌పై ఆయన పూర్తి స్థాయిలో పని చేయనున్నారని సమాచారం.
తాను ఓ భిన్నమైన వృత్తి సాహాసాన్ని ప్రారంభించానని జో బెనారోచ్ తెలిపారు. ట్విటర్ బిజినెస్ కార్యాకలపాలపై దృష్టి సారించేందుకు బాధ్యతలను తీసుకుంటానని, తన అనుభవం మొత్తాన్ని ట్విటర్‌లో కేంద్రీకరిస్తానని చెప్పారు. ట్విట్టర్ 2.0 నిర్మిచేందుకు.. టీం అందరితో కలిసి పని చేస్తానని జో బెనారోచ్ తెలిపారు. ట్విటర్ సీఈవో లిండా యాకరినో కూడా గతంలో ఇవే వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌తో పాటు మిలియన్ల యూజర్లతో కలిసి ట్విట్టర్లో మార్పులు తెస్తానని ఆమె తెలిపారు. లిండా గత పన్నెండేళ్లుగా ఎన్‌బీసీ యూనివర్సల్ సంస్థలో పనిచేశారు. లిండా యాకరినో గత నెలలో ఓ ఈవెంట్లో మస్క్‌ను ఇంటర్వ్యూ కూడా చేశారు. 2020 అక్టోబర్ నెలలో 44 బిలియన్ డాలర్లుకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు మస్క్. సంస్థ పగ్గాలు చేపట్టిన వెంటనే.. సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో సహా సంస్థలో పనిచేస్తున్న కీలక ఉద్యోగులను తొలగించారు. అనంతరం ట్విట్టర్లో భారీ మార్పులకు స్వీకారం చుట్టారు.