సినిమా చూసేందుకు లుంగీలో వ‌చ్చాడ‌ని టికెట్ ఇవ్వ‌ని మల్టీప్లెక్స్‌ థియేటర్‌

lderly man denied tickets for wearing lungi sparks controversy.సాదార‌ణంగా ఆఫీసులు, పాఠ‌శాల‌ల‌కు డ్రెస్ కోడ్ లాంటివి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2022 3:49 AM GMT
సినిమా చూసేందుకు లుంగీలో వ‌చ్చాడ‌ని టికెట్ ఇవ్వ‌ని మల్టీప్లెక్స్‌ థియేటర్‌

సాధార‌ణంగా ఆఫీసులు, పాఠ‌శాల‌ల‌కు డ్రెస్ కోడ్ లాంటివి ఉంటాయి. అందుక‌నే ఆయా సంస్థ‌ల‌కు వెళ్లేట‌ప్పుడు విధిగా అక్క‌డి నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. మామూలుగా బ‌య‌ట‌కు వెళ్లేటప్పుడు మ‌న‌కు న‌చ్చిన దుస్తులు ధ‌రించొచ్చు. అయితే.. ఓ థియేట‌ర్ యాజ‌మాన్యం సినిమాకి లుంగీలో వ‌చ్చాడ‌ని ఓ ప్రేక్ష‌కుడికి టికెట్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఈ విష‌యంపై నెటీజ‌న్ల నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావడంతో దెబ్బ‌కు ఆ థియేట‌ర్ యాజ‌మ‌న్యం దిగొచ్చింది. ఈ ఘ‌ట‌న బంగ్లాదేశ్ దేశంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. బంగ్లాదేవ్‌ రాజధాని ఢాకాలోని సోనీ స్క్వేర్‌ బ్రాంచ్‌లో ఉన్న స్టార్ సినీఫ్లెక్స్‌ థియేట‌ర్‌లో 'పోర‌న్‌' అనే చిత్రాన్ని చూసేందుకు స‌మ‌న్ అలీ స‌ర్కార్ లుంగీ ధ‌రించి వెళ్లాడు. అయితే.. థియేట‌ర్ వాళ్లు అత‌డి వేషాదార‌ణ చూసి టికెట్ ఇచ్చేందుకు నిరాక‌రించార‌ని అలీ మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో నెటీజ‌న్లు థియేట‌ర్ యాజ‌మాన్యంపై దుమ్మెత్తిపోశారు. అప్ర‌మ‌త్త‌మైన థియేట‌ర్ యాజ‌మాన్యం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో పాటు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రణ ఇచ్చింది.

ప్రేక్ష‌కుల ప‌ట్ల తాము ఎలాంటి వివ‌క్ష చూప‌డం లేద‌ని, అలాంటి విధానాలను తాము అనుసరించబోమని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. జరిగిన ఘటనకు చింతిస్తున్నట్టు తెలిపింది. సుమన్ అలీ సర్కార్ తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపింది. స‌ర్కార్‌తో అత‌డి కుటుంబాన్ని అదే మ‌ల్టీఫ్లెక్స్‌లో సినిమా చూసేందుకు రావాల‌ని ఆహ్వానించింది. అంతేకాకుండా వారితో తీసుకున్న ఫోటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోర‌స్ న‌టుల్లో ఒక‌రైన స‌రిపుల్ రాజ్ కూడా వారితో క‌లిసి సినిమా చూడ‌డం విశేషం.

Next Story