పాలస్తీనా రాకెట్ దాడి మృతులలో కేరళ మహిళ

Kerala Woman Killed In Palestinian Rocket Strike In Israel. ఇజ్రాయిల్, గాజా మధ్య జరుగుతున్న పరస్పర దాడులకు ఇప్పటికే పదుల

By Medi Samrat  Published on  12 May 2021 1:03 PM GMT
Kerala Woman Killed In Palestinian Rocket strike

ఇజ్రాయిల్, గాజా మధ్య జరుగుతున్న పరస్పర దాడులకు ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా జరిగిన దాడిలో కేరళ కు చెందిన సౌమ్య అనే మహిళ మృతి చెందారు. ఇజ్రాయెల్లోని యాష్కాలాన్ సిటీలో ఆమె నివసిస్తున్నారు. ఆమె తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగానే గాజా ప్రయోగించిన రాకెట్ ఆమె ఇంటి పై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. సౌమ్య మరణంతో ఆమె కుటుంబం, సన్నిహితులు, తోటి ఉద్యోగులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సౌమ్య సంతోష్ కుటుంబానికి పలువురు ప్రముఖులు సైతం సంతాప సందేశాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా సౌమ్య మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు.

ఇజ్రాయిల్ ప్రభుత్వం తరఫున తాను సౌమ్య కుటుంబసభ్యులతో మాట్లాడానని, ఆమె మృతికి దేశమంతా చింతిస్తూ ఉందన్నారు. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ళ వయసు వాడని తల్లి లేకుండానే తన జీవితాన్ని గడపాల్సి రావటం తనని ఎంతో బాధకు గురి చేస్తోందన్నారు. ఈ సందర్బంగా 2008 లో ముంబై పేలుళ్లలో తన తలిదండ్రులను కోల్పోయిన ఇజ్రాయెల్ల్ చిన్నారి మోసెస్ ను గుర్తు చేసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని కోరుతున్నానన్నారు. సౌమ్య మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ కూడా ట్వీట్ చేశారు.


Next Story