భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి

ఫిజిక్స్ విభాగంలో నోబెల్ బహుమతులు ప్రకటించారు. ఈ సంవత్సరం నోబెల్ పుర‌స్కారాల‌ను శాస్త్రవేత్తలు జాన్ హాప్‌ఫీల్డ్, జియోఫ్రీ హింటన్‌లు అందుకోనున్నారు

By Medi Samrat  Published on  8 Oct 2024 4:11 PM IST
భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి

ఫిజిక్స్ విభాగంలో నోబెల్ బహుమతులు ప్రకటించారు. ఈ సంవత్సరం నోబెల్ పుర‌స్కారాల‌ను శాస్త్రవేత్తలు జాన్ హాప్‌ఫీల్డ్, జియోఫ్రీ హింటన్‌లు అందుకోనున్నారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లలో మెషిన్ లెర్నింగ్‌ను ఎనేబుల్ చేయడానికి సంబంధించిన‌ ఆవిష్కరణకు గాను ఈ శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు ఇవ్వనున్న‌ట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

నోబెల్‌ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రదానం చేస్తుంది. నోబెల్ ప్రైజ్ విజేత‌కు జ్ఞాపిక‌తో పాటు 11 మిలియన్ స్వీడిష్ క్రోన‌ర్ ($1.1 మిలియన్) ప్రైజ్ మనీ అంద‌జేస్తారు. ఒకరు కంటే ఎక్కువ ఉంటే విజేతలకు డ‌బ్బు స‌మానంగా పంచబడుతుంది. బహుమతి వ్యవస్థాపకుడు, 1896లో మరణించిన స్వీడిష్ పౌరుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎస్టేట్ నుండి డబ్బు ఇవ్వబడుతుంది. నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న నోబెల్ బహుమతి విజేతలను సత్కరిస్తారు.

ఇదిలావుంటే.. మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు గాను సోమవారం నాడు ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం విభాగంలో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటిస్తారు. శాంతి నోబెల్ బహుమతిని శుక్రవారం, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 14న ప్రకటించనున్నారు.

Next Story