అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం

Joe Biden sworn in as 46th US president. అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల‌లో జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసిన జో బైడెన్.. ఆ దేశ‌‌ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం.

By Medi Samrat  Published on  20 Jan 2021 5:38 PM GMT
Joe Biden is sworn in as 46th US president

అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల‌లో జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసిన జో బైడెన్.. ఆ దేశ‌‌ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తన కుటుంబానికి చెందిన 127 ఏళ్ల నాటి బైబిల్‌పై బైడెన్ ప్రమాణం చేశారు. 78 ఏళ్ల వయసులో జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. దీంతో 'ఇనాగరేషన్ డే'గా పిలుచుకునే అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం పూర్తయ్యింది.



ఇక‌ అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయసులో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా జో బైడెన్ స‌రికొత్త రికార్డు సృష్టించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జో బైడెన్ మాట్లాడుతూ.. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని అన్నారు. ఇది అమెరికా ప్రజలందరి విజయమని చెప్పారు. ముందు ముందు సాధించాల్సింది చాలా ఉందని అన్నారు. క్యాపిటల్ హిల్ హింసతో అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని అందరూ భయపడ్డారని.. అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని జో బైడెన్ పేర్కొన్నారు. అలాగే.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత‌రం ట్విటర్ ప్రొఫైల్‌ మార్చారు. ఆ త‌ర్వాత‌ ప్రజలకు సేవచేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తొలి ట్వీట్ చేశారు.





Next Story