మరో ఇండో- అమెరికన్ కు కీలక పదవి

Joe Biden nominates Seema Nanda as solicitor in department of labour. భారతీయ మూలాలున్న మహిళ సీమా నందాను జో బిడెన్ స్వయంగా లేబర్ సొలిసిటర్ గా నామినేట్ చేశారు.

By Medi Samrat  Published on  28 March 2021 7:15 AM GMT
Joe Biden nominates Seema Nanda as solicitor in department of labour.

అగ్రరాజ్యంలో మరోసారి ఒక భారతీయ మహిళ ప్రతిభకు గుర్తింపు లభించింది. అమెరికాలోని డెమొక్రటిక్‌ పార్టీకి భారతీయ మూలాలున్న మహిళ సీమా నందాను జో బిడెన్ స్వయంగా లేబర్ సొలిసిటర్ గా నామినేట్ చేశారు. ఈ ఉన్నత పదవికి ఎన్నికైన తొలి ఇండియన్‌ అమెరికన్‌గా సీమా నందా చరిత్ర సృష్టించారు. తన పాలనలో 50 శాతం మందికి పైగా భారత సంతతి వ్యక్తులకు పదవులను ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాగా, గతంలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా సీమ పలు బాధ్యలు సమర్థవంతంగా నిర్వహించారు. దాదాపు పదిహేనేళ్లుగా పైగా లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ అటార్నీ విభాగాల్లో ఆమె సేవలందించారు. అత్యధికంగా ప్రభుత్వ సర్వీసులకు సంబందించిన కార్యకలాపాలను ఆమె నిర్వహించారు. ఇప్పుడామె యూఎస్ జస్టిస్ డిపార్ట్ మెంట్ పరిధిలో ఉన్న పౌర హక్కుల విభాగంలో విదేశాల నుంచి అమెరికాకు వచ్చే ఇమిగ్రెంట్స్, యూఎస్ ఉద్యోగుల హక్కుల విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. అమెరికాలోని కనెక్టికట్ లో పెరిగిన సీమా నందా, ఆపై బోస్టన్ కాలేజ్ న్యాయ పాఠశాల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాను, దాని తరువాత బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు.


Next Story