భారత్-పాక్ యుద్ధంతో మాకు సంబంధం లేదు: అమెరికా వైస్ ప్రెసిడెంట్

భారత్-పాకిస్థాన్ యుద్ధంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

By Knakam Karthik
Published on : 9 May 2025 7:30 AM IST

International News, US Vice President JD Vance, India-Pak dispute

భారత్-పాక్ యుద్ధంతో మాకు సంబంధం లేదు: అమెరికా వైస్ ప్రెసిడెంట్

భారత్-పాకిస్థాన్ యుద్ధంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వివాదంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోదని.. ఇది అమెరికాకు సంబంధించినది కాదు" అని జేడీ వాన్సన్ ప్రకటించారు. ఒహియో మాజీ సెనేటర్ అయిన జేడీ వాన్స్ శుక్రవారం ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, ఈ వివాదం ‘సాధ్యమైనంత త్వరగా తగ్గాలని’ అమెరికా కోరుకుంటుందని అన్నారు. అయితే, ఈ దేశాలను మేము నియంత్రించలేము. ప్రాథమికంగా, భారతదేశానికి పాకిస్తాన్‌తో విభేదాలు ఉన్నాయి. పాకిస్తాన్ తనపై భారతదేశ దాడులకు ప్రతిస్పందించింది. మనం చేయగలిగేది ఏమిటంటే, ఈ ఘర్షణను కొంచెం తగ్గించమని కోరడం, కానీ ప్రాథమికంగా మాకు సంబంధం లేని, అమెరికా నియంత్రణ సామర్థ్యంతో సంబంధం లేని యుద్ధంలో మనం పాల్గొనబోము” అని వాన్స్ వ్యాఖ్యానించారు.

కాగా గురువారం పాకిస్తాన్ పౌర, సైనిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులు తీవ్రమైన ఫిరంగి దాడులతో ఉద్రిక్త పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. మే 7న ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారతదేశం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. భారతదేశం డ్రోన్లు ,క్షిపణులను అడ్డుకోవడమే కాకుండా, పాకిస్తాన్ యుద్ధ విమానాలను, వైమానిక హెచ్చరిక నియంత్రణ వ్యవస్థను (AWACS) కూడా కూల్చివేసింది.

Next Story