వరుస భూకంపాలతో దద్దరిల్లిన జపాన్.. రష్యా, కొరియాలో అప్రమత్తం
సోమవారం జపాన్‌లో వరుస బలమైన భూకంపాలు సంభవించాయి. భూకంపం ధాటికి సముద్రంలో ఐదు అడుగుల ఎత్తులో సునామీ అలలు వచ్చాయి.
By అంజి Published on 2 Jan 2024 7:00 AM ISTవరుస భూకంపాలతో దద్దరిల్లిన జపాన్.. రష్యా, కొరియాలో అప్రమత్తం
సోమవారం జపాన్‌లో వరుస బలమైన భూకంపాలు సంభవించాయి. భూకంపం ధాటికి సముద్రంలో ఐదు అడుగుల ఎత్తులో సునామీ అలలు వచ్చాయి. దీంతో అధికారులు దేశంలోని వాయువ్య తీరంలో ప్రజలకు సునామీ హెచ్చరికలు, తరలింపు సలహాలను జారీ చేశారని స్థానిక మీడియా నివేదించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. భూకంపం ఇషికావా, సమీపంలోని ప్రిఫెక్చర్‌లను తాకింది. వాటిలో ఒకటి రిక్టర్ స్కేలుపై 7.6 భారీ తీవ్రతను కలిగి ఉందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. స్థానిక వాతావరణ సంస్థల ప్రకారం.. భూకంపం తర్వాత ఇషిగావాలోని నోటోలో భూకంప కేంద్రం నుండి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
సాయంత్రం 4:06 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) 5.7 తీవ్రతతో భూకంపం ప్రారంభమైంది. దీని తర్వాత సాయంత్రం 4:10 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) 7.6 తీవ్రతతో భూకంపం, 4:18 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) 6.1 తీవ్రతతో భూకంపం, 4:23 గంటలకు 4.5 (స్థానిక కాలమానం), 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. సాయంత్రం 4:29 గంటలకు భూకంపం (స్థానిక కాలమానం), సాయంత్రం 4:32 గంటలకు 4.8 తీవ్రతతో భూకంపం (స్థానిక కాలమానం) సంభవించింది. ఆ వెంటనే 6.2 తీవ్రతతో మరో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
జపనీస్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే ప్రకారం.. సునామీ హెచ్చరికను అనుసరించి ఇషికావాలోని నోటో తీరాన్ని 5 మీటర్ల ఎత్తులో అలలు తాకడంతో ప్రజలు త్వరగా తీర ప్రాంతాలను విడిచిపెట్టి భవనాలు లేదా ఎత్తైన భూమికి వెళ్లాలని కోరారు. 4.0 తీవ్రతతో 21 భూకంపాలు నమోదైనట్లు స్థానిక వాతావరణ కార్యాలయం తెలిపింది. ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్‌ల పశ్చిమ తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికలను జేఎమ్‌ఏ జారీ చేసింది. నీగాటా, టొయామాతో సహా ఇతర ప్రిఫెక్చర్‌లలో అలలు 3 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. సోషల్ మీడియాలో అనేక వీడియోలు భవనాలు వణుకుతున్నట్లు చూపించాయి. ప్రజలు రక్షణ కోసం పరుగులు తీశారు.భూకంపాల వల్ల పలు ఇళ్లు నేలమట్టం కాగా, ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు పగుళ్లకు దారితీశాయి.