Viral Video : లైవ్ లో ఉండగా.. వెనుక నుండి వచ్చి తాకిన మిసైల్

లెబనీస్ జర్నలిస్ట్ లైవ్ టీవీ ఇంటర్వ్యూలో ఉండగా ఇజ్రాయెల్ క్షిపణి అతని ఇంటిని తాకింది.

By Medi Samrat  Published on  25 Sep 2024 11:09 AM GMT
Viral Video : లైవ్ లో ఉండగా.. వెనుక నుండి వచ్చి తాకిన మిసైల్

లెబనీస్ జర్నలిస్ట్ లైవ్ టీవీ ఇంటర్వ్యూలో ఉండగా ఇజ్రాయెల్ క్షిపణి అతని ఇంటిని తాకింది. ఈ ప్రమాదంలో అతడు కాస్తా గాయపడ్డాడు. మిరయా ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఫాడి బౌదయా మాట్లాడుతూ ఉండగా క్షిపణి అతని ఇంటిని తాకింది. ఆ సమయంలో తన బ్యాలెన్స్ కోల్పోయారు. కింద పడిపోయారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి.

ఇజ్రాయెల్ - ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఫాడి బౌదయా ఇంటిపై దాడి జరిగింది. హిజ్బుల్లా సభ్యులపై సైబర్ దాడి జరిగిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఈ సమయంలో కమ్యూనికేషన్ పరికరాలు పేజర్లు, వాకీ-టాకీలు పేలాయి. ఇక ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనీస్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేయమని ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాము చేస్తున్న ఆపరేషన్ పూర్తయిన తర్వాత, వారు తిరిగి తమ ఇళ్లకు తిరిగి రావాలని సూచించారు.

బీరూట్‌ పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా క్షిపణి విభాగం అధిపతి ఇబ్రహీం ఖుబైసీ హతమయ్యాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఖుబైసీ అతడి మరణాన్ని ధృవీకరించింది. హిజ్బుల్లా క్షిపణి కార్యకలాపాలలో ఇబ్రహీం ఖుబైసీ కీలక వ్యక్తి. ఖుబైసీతో పాటు ఇద్దరు ఉన్నత స్థాయి కమాండర్లు మరణించినట్లు నివేదించారు.

Next Story