మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా..? ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..!
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రత్యక్ష వైమానిక దాడులను ప్రారంభించింది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 7:54 AM ISTఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రత్యక్ష వైమానిక దాడులను ప్రారంభించింది.ఇస్లామిక్ రిపబ్లిక్‌లోని సైనిక లక్ష్యాలపై తాము ఖచ్చితమైన దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, సమీప ప్రాంతాలలో తెల్లవారుజామున పేలుళ్లు సంభవించాయి. ఒక ప్రకటనలో ప్రతిస్పందించడం తమ 'హక్కు', తక్షణ 'కర్తవ్యం' అని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
ఇరాన్ అక్టోబరు 1న దాడి చేసిన సంగతి తెలిసిందే. టెల్ అవీవ్, ఇజ్రాయెలీ వైమానిక స్థావరాలలో ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు అంచనా వేశారు. ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ దాడిని చేపట్టింది . ఇజ్రాయెల్ హమాస్, హిజ్బుల్లాలను లక్ష్యంగా చేసుకుని గాజా, లెబనాన్‌లలో ఓ వైపు దాడులు చేస్తూ వెళుతోంది. ఇప్పుడు ఇరాన్ మీద చేసిన దాడి మరిన్ని ఉద్రిక్తతలను పెంచేస్తోంది. టెహ్రాన్ సమీపంలోని కరాజ్ నగరం చుట్టూ పేలుళ్లు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ టీవీ నివేదించింది. నగరం చుట్టూ మోహరించిన వాయు రక్షణ వ్యవస్థల నుండి శబ్దాలు వచ్చి ఉండవచ్చని కొన్ని నివేదికలు సూచించాయి. టెహ్రాన్ నివాసి అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ కనీసం ఏడు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని చెప్పారు.