చంపింది తామే అని ఒప్పుకున్న డిఫెన్స్ మినిష్టర్

హమాస్ నేత ఇస్మాయిల్‌ హనీయే హత్య తామే చేశామని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ స్పష్టం చేశారు.

By Medi Samrat  Published on  24 Dec 2024 9:15 PM IST
చంపింది తామే అని ఒప్పుకున్న డిఫెన్స్ మినిష్టర్

హమాస్ నేత ఇస్మాయిల్‌ హనీయే హత్య తామే చేశామని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ స్పష్టం చేశారు. హమాస్‌, హెజ్‌బొల్లాలను ఓడించామని, ఇరాన్‌ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశామని తెలిపారు. హనియే, సిన్వర్, నస్రల్లాలను కూడా హతమార్చామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక యెమెన్‌లోని హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

ఖతార్‌లో ఉన్న హనీయే హమాస్ కోసం అంతర్జాతీయ దౌత్యం జరుపుతూ ఉండేవాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొనడం కోసం హనియే వచ్చాడు. అదను చూసి ఇజ్రాయెల్ దాడి చేయడంతో టెహ్రాన్ లో హనియే హతమయ్యాడు. ఇజ్రాయెల్‌ ఈ దాడి చేసిందని ఇరాన్ గతంలో ఆరోపించగా తాజాగా ఈవిషయాన్ని ధ్రువీకరించింది. టెహ్రాన్‌లోని నివాసంపై దాడి చేయడంతో హనియే, అతని అంగరక్షకుడు మరణించారు.

Next Story