పొంచి ఉన్న ఉగ్ర‌ముప్పు.. 6 నెల‌ల్లో దాడి జ‌ర‌గొచ్చు..!

ISIS in Afghanistan could be able to attack US in 6 months.అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా ద‌ళాలు అలా వెళ్లాయో లేదో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2021 7:25 AM GMT
పొంచి ఉన్న ఉగ్ర‌ముప్పు.. 6 నెల‌ల్లో దాడి జ‌ర‌గొచ్చు..!

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా ద‌ళాలు అలా వెళ్లాయో లేదో తాలిబ‌న్లు ఏకంగా దేశాన్ని ఆక్ర‌మించుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ (ఖొరాసన్) ఉగ్ర‌సంస్థ‌లు మ‌ళ్లీ ఉనికిని చాటుకోవ‌డం మొద‌లుపెట్టాయి. అఫ్గాన్‌లో ప్ర‌జ‌ల‌పై బాంబుల‌తో దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో అమాయ‌క ప్ర‌జ‌లు ఎంద‌రో త‌మ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక అమెరికాపై మ‌రో ఆరు నెల‌ల్లో ఉగ్ర‌దాడి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని పెంట‌గాన్ సీనియ‌ర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

ఐసీస్‌తో తాలిబన్లకు శత్రుత్వం ఉందని, దీంతో వారిపై ఉక్కుపాదం మోపేందుకు చట్టం తీసుకురావాలని తాలిబన్లు యోచిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే.. తాలిబ‌న్లు వారిపై గెలుస్తారా..? లేదా అన్న అనుమానుల‌ను వ్య‌క్తం చేశారు. తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ దేశాలు గుర్తించ‌క పోవ‌డంతో ఆ దేశంలో ఉగ్ర‌సంస్థ‌ల బ‌లం పెరిగే అవ‌కాశం ఉంద‌ని, ఇది ఆఫ్ఘ‌న్ దేశానికి మాత్ర‌మే కాకుండా ప్ర‌పంచంలోని అనేక దేశాల‌కు ముప్పుగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక తాలిబ‌న్ల అండ‌తో అల్‌ఖైదా మ‌ళ్లీ పుంజుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. ఒక‌టి లేదా రెండు సంవ‌త్స‌రాల కాలంలో అమెరికా భూభాగంపై దాడులు చేసే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

Next Story