ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌కుండా మ‌హిళ‌ల‌పై నిషేదం.. ఐస్ క్రీం యాడ్ ఎంత పని చేసింది

Iran bans women from appearing in ads.ఓ ఐస్‌క్రీం యాడ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఫ‌లితంగా ఇక పై మ‌హిళ‌లు ఎలాంటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2022 12:53 AM GMT
ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌కుండా మ‌హిళ‌ల‌పై నిషేదం.. ఐస్ క్రీం యాడ్ ఎంత పని చేసింది

ఓ ఐస్‌క్రీం యాడ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఫ‌లితంగా ఇక పై మ‌హిళ‌లు ఎలాంటి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌కుండా నిషేదాన్ని విధించారు.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌హిళ‌లు ఐస్‌క్రీం తింటున్న‌ట్లుగా ఇరాన్‌లో ఇటీవ‌ల రెండు యాడ్‌లు విడుద‌ల అయ్యాయి. అందులో న‌టించిన మ‌హిళ హిజాబ్‌ను లూజ్‌గా ధ‌రించింది. దీనిపై పెద్ద దుమార‌మే రేగింది. ఇరాన్ మ‌త‌పెద్ద‌లు ఆగ్రహం వ్యక్తంచేశారు. హిజాబ్‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని, మ‌హిళ‌ల‌ను అభ్యంత‌ర‌క‌ర రీతిలో చూపించార‌ని మండిప‌డ్డారు. మ‌హిళా విలువ‌ల‌ను అవ‌మానించేవిగా, గౌర‌వ మ‌ర్యాద‌ల‌ను మంట‌గ‌లిపేవిగా ఉన్నాయ‌ని ఆరోంచారు. ఐస్‌క్రీమ్ కంపెనీ డోమినోపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.

దీనిపై ఆ దేశ సాంస్కృతిక శాఖ స్పందించింది. అడ్వ‌ర్టైజ్మెంట్లు ఏజెన్సీల‌కు లేఖ‌లు రాసింది. ఇక‌పై మ‌హిళ‌లు ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌డాన్ని నిషేదించింది. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ క‌ల్చ‌ర‌ల్ రెవ‌ల్యూష‌న్ తీర్పుల‌కు అనుగుణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇస్లామిక్ విప్ల‌వం త‌రువాత నుంచి ఇరాన్‌లో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌హిళ‌లు హిజాబ్ ధ‌రించ‌డాన్ని త‌ప్పనిస‌రి చేశారు. అయితే.. దీన్ని చాలా మంది మ‌హిళ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో దీనిపై త‌మ స్వ‌రాన్ని పెంచారు.

Next Story